అదిరిపోయే ఫీచర్లతో కొత్త డెల్ డెస్క్‌టాప్ లాంచ్.. ధర ఎన్ని లక్షలో తెలిస్తే!!

డెల్ కంపెనీ బడ్జెట్ రేంజ్ నుంచి హైయెస్ట్ ప్రీమియం రేంజ్ వరకు ల్యాప్‌టాప్స్‌, డెస్క్‌టాప్‌లను మార్కెట్లో రిలీజ్ చేస్తుంటుంది.కాగా తాజాగా ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది.

 New Dell Desktop Launch With Amazing Features.. If You Know The Price In How Ma-TeluguStop.com

దీని ధర మరింత హైలెట్‌గా మారింది.డెల్ కొద్ది గంటల క్రితమే ఇండియాలో ‘Alienware Aurora R15‘ అనే కొత్త డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను పరిచయం చేసింది.

ఇది 13వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు, Nvidia GeForce RTX 4090 GPUతో సహా పవర్‌ఫుల్ ఫీచర్లతో లాంచ్ అయింది.

Telugu Desktop, Dell Desktop, Premium Desktop-Latest News - Telugu

ఈ డెస్క్‌టాప్‌ను మెరుగైన కూలింగ్ కోసం చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.ముఖ్యంగా దీని లోపల చాలా ఖాళీ స్పేస్ ఇచ్చారు.ఇది గరిష్టంగా 1350W పవర్‌కి మద్దతు ఇవ్వగలదు.

కనెక్షన్‌ల కోసం అనేక పోర్ట్‌లను కూడా అందించారు.ఏలియన్‌వేర్ ఔరోరా R15 కస్టమైస్డ్‌ RGB లైట్లను కూడా కలిగి ఉంది.

ఇది రెండు వేర్వేరు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Telugu Desktop, Dell Desktop, Premium Desktop-Latest News - Telugu

మొదటి వెర్షన్ కోర్-i913900KF ప్రాసెసర్, 32జీబీ ర్యామ్, 512GB SSD, 1TB HDD స్టోరేజ్‌తో వస్తుంది.దీని ధర ఏకంగా 5,49,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించడం ఇప్పుడు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.ఇక రెండవ వెర్షన్ కోర్-i7 13700KF ప్రాసెసర్, 16GB RAM, 512GB SSD, 1TB HDD స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ సెకండ్ వెర్షన్ ధర మార్చిలో వెల్లడించనున్నారు.ఈ డెస్క్‌టాప్ 60+ FPS వద్ద రే-ట్రేస్డ్ 4K గేమింగ్, మెరుగైన ఓవర్‌క్లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది.ఈ కంప్యూటర్ హై-క్వాలిటీ గేమింగ్ కోసం రూపొందించబడింది.ఇది AI యాక్సిలరేషన్, ఇంటిలిజెంట్ రెస్పాన్స్ వంటి మరిన్ని అడ్వాన్స్ టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్స్, అదినా తన టెక్నాలజీల వల్ల దీని ధర ఇంత రేంజ్ లో ఉంది.హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube