క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. బిల్లింగ్ డేట్‌లో ఆర్‌బీఐ కొత్త రూల్స్!

క్రెడిట్ కార్డు తీసుకున్న కస్టమర్లు తిరిగి చెల్లించే విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.బాగా డబ్బు ఉన్న వారైతే వెంటనే క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తారు.

 New Credit Card Billing Rules Effective From July 1,credit Card,credit Card Billing Rules,rbi,rbi New Rules,rbi Alert,credit Card Billing-TeluguStop.com

కానీ మధ్య తరగతి ప్రజలకు మాత్రం వీటిని సకాలంలో తిరిగి చెల్లించడం చాలా కష్టంగా అనిపిస్తుంది.అదనపు ఛార్జీల పడకుండా ఉండేందుకు వారు బిల్లులను సరైన సమయంలో తప్పక చెల్లించాల్సిందే.

అయితే క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు కంపెనీలు ఒక నిర్దిష్ట బిల్లింగ్ తేదీని నిర్ణయిస్తాయి.ఈ తేదీ ఒక్కోసారి కస్టమర్ల వద్ద డబ్బులు లేనప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది.

 New Credit Card Billing Rules Effective From July 1,Credit Card,Credit Card Billing Rules,RBI,RBI New Rules,RBI Alert,Credit Card Billing-క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. బిల్లింగ్ డేట్‌లో ఆర్‌బీఐ కొత్త రూల్స్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనివల్ల కస్టమర్లు బిల్లును కట్టలేరు.ఈ బిల్లింగ్ తేదీని చేంజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఇప్పటివరకు అందుబాటులో లేదు.

దీంతో కొందరు కార్డులను రద్దు చేసుకుంటున్నారు.

అయితే ఈ సమస్యపై దృష్టి సారించిన ఆర్‌బీఐ తాజాగా క్రెడిట్ కార్డ్ కస్టమర్లందరికీ తీపి కబురు అందించింది.

కార్డుదారులు ఒక్కసారి తమ క్రెడిట్ కార్డు బిల్లింగ్ డేట్‌ను చేంజ్ చేసుకోవచ్చు అని ప్రకటించింది.ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది.ఆర్‌బీఐ న్యూ క్రెడిట్ కార్డు రూల్స్ జూలై 1, 2022 అమల్లోకి వస్తాయి.అంటే ఇంకో నెల తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ను ఒక్కసారి చేంజ్ చేసుకోవచ్చు.

సాధారణంగా రెండు బిల్లింగ్‌ల మధ్య ఉండే 30 రోజుల వ్యవధిని బిల్లింగ్ సైకిల్ అని పిలుస్తారు.ఈ సైకిల్ పూర్తవ్వగానే 15 నుంచి 25 రోజులలోగా కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లు పే చేయాల్సి ఉంటుంది.ఈ బిల్లును సకాలంలో ప్లే చేయడం ద్వారా అదనపు ఛార్జీలు, వడ్డీ వంటి ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవచ్చు.లేనిపక్షంలో వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజు వంటివి చెల్లించుకోవాల్సి ఉంటుంది.

దీనికి తోడు క్రెడిట్ స్కోర్ కూడా బాగా తగ్గుతుంది.అయితే సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించుకునేలా బిల్లింగ్ సైకిల్‌ డేట్‌ను చేంజ్ చేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పిస్తోంది కాబట్టి దగ్గర బాగా డబ్బు ఉన్న తేదీల్లో బిల్లింగ్ సైకిల్ వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube