డిసెంబర్ నుండి అమలులోకి రానున్న కోవిడ్ కొత్త రూల్స్..!

గత వారం రోజుల వరకు భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన, మళ్లీ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి.పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

 Central Govt Issues New Covid Rules, Corona Cases, Home Quarantine, Lockdown, In-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.ఇందులో భాగంగానే తాజాగా డిసెంబర్ నెల ఒకటో తారీకు నుండి అమలులోకి తీసుకరావాల్సిన కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ముఖ్యంగా అన్ని రాష్ట్ర మంత్రులు, అలాగే కేంద్రపాలిత మంత్రులు కంటోన్మెంట్ జోన్ల విషయంలో మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

జోన్ల పరిధిలో నిత్యావసర వస్తువుల నిమిత్తం వెళ్లే వారికి మాత్రమే అవకాశం ఉంటుందని అందులో స్పష్టంగా వివరించింది.

ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.ఇందులో భాగంగానే ఈ కేసుల తీవ్రతను బట్టి అక్కడ ఉన్న ప్రభుత్వాలు లాక్ డౌన్ సంబంధించిన రూల్స్ ను ఉంచుకోవచ్చని అలాగే రాత్రిపూట కర్ఫ్యూ పెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాన్ని వదిలేసింది.

ఒకవేళ కరోనా కేసులు పెరగకుండా ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వహించుకోవచ్చని, అలాగే కేసుల సంఖ్య 10 శాతం కంటే మించితే ఆ కార్యాలయాల సమయాలను మార్చుకోవాలని లేకపోతే షిఫ్ట్ పద్ధతుల్లో ఉద్యోగులు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Telugu Central, Central Covid, Corona, Covid, Quarantine, India, Lockdown-Latest

కంటోన్మెంట్ జోన్ లలో సినిమా హాల్స్ అలాగే స్విమ్మింగ్ పూల్స్ తెరుచుకోవచ్చని.కాకపోతే కచ్చితంగా ప్రభుత్వం విధించిన విధానాలకు అనుగుణంగా మాత్రమే వాటిని నడపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.అలాగే ఎగ్జిబిషన్ హాల్స్ తెరుచుకోవచ్చని వాటిలో మొత్తం హాల్ కెపాసిటీలో కేవలం 50 శాతానికి మాత్రమే పరిమితమై వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది.అయితే సరుకు రవాణా, ప్రజా రవాణా తదితర అంశాలపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రయాణాలకు విడివిడిగా అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అయితే ఒకవేళ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని తెలిసిన తర్వాత అతను గడిచిన 72 గంటల్లో ఎవరెవరిని కలిశారన్న విషయాన్ని ట్రేస్ చేయాలని.వారి లక్షణాలను బట్టి ఆసుపత్రి లేదా హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చేపట్టాలని హోం శాఖ తాజాగా ఆదేశాలలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube