ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పాఠశాలలకు కొత్త ర్యాపిడ్ టెస్టింగ్స్, ఈ వారంలోనే అందుబాటులోకి : వైట్‌హౌస్

దక్షిణాఫ్రికాలో పుట్టిన కోవిడ్ కొత్త వేరియంట్ కారణంగా అన్ని దేశాలు మరోసారి అల్లాడుతున్న సంగతి తెలిసిందే.ప్రతి రోజు లక్షల్లో కేసులు బయటపడుతున్నాయి.

 New Covid-19 Rapid Tests To Arrive In Us Schools This Week: White House , Us Schools , White House, Omicron, Biden, Us Centers For Disease Control And Prevention, Head Rochelle Valensky, Pennsylvania, Texas,-TeluguStop.com

భారత్‌లో సైతం వైరస్ బారినపడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.అగ్రరాజ్యం అమెరికాలోనూ కేసులు అల్లాడిస్తున్నాయి.

దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని ఆ దేశ ప్రభుత్వం కోరుతోంది.కొత్త వేవ్ భయాలతో చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 New COVID-19 Rapid Tests To Arrive In US Schools This Week: White House , US Schools , White House, Omicron, Biden, US Centers For Disease Control And Prevention, Head Rochelle Valensky, Pennsylvania, Texas, -ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పాఠశాలలకు కొత్త ర్యాపిడ్ టెస్టింగ్స్, ఈ వారంలోనే అందుబాటులోకి : వైట్‌హౌస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే తమను ఆన్‌లైన్ క్లాసులకు అనుమతించాలని కోరుతూ పలు చోట్ల విద్యార్ధులు ఆందోళనకు సైతం దిగుతున్నారు.ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని వచ్చే రెండు వారాల్లో కోవిడ్ 19ను వేగంగా నిర్ధారించే ర్యాపిడ్ టెస్టింగ్‌ను పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం.

కొత్త పరీక్షలు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం చేయనున్నారు.వైట్‌హౌస్ ఐదు మిలియన్ల నెలవారీ పీసీఆర్ పరీక్షలకు అనుగుణంగా ల్యాబ్ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని ఓ అధికారి తెలిపారు.

ఆయా రాష్ట్రాలు ఈ విషయంలో సాయం చేయకుంటే.పరీక్షల కోసం పాఠశాలలు ఆర్డర్ చేసుకోవచ్చని సదరు అధికారి పేర్కొన్నారు.కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నందున.10 మిలియన్ల పరీక్షలతో కరోనా టెస్టింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు స్కూళ్లను తెరిచి వుంచేందుకు వీలుగా బైడెన్ యంత్రాంగం గత బుధవారం కొత్త చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే.గడిచిన వారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనాతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 33 శాతం పెరిగింది.అలాగే మరణాలు కూడా 40 శాతం అధికమైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెడ్ రోచెల్ వాలెన్స్‌కీ వెల్లడించారు.

గతేడాది ఆమోదించిన చట్టంలో పేర్కొన్న విధంగా కోవిడ్ టెస్టుల కోసం విడుదల చేసిన నిధుల్లో 10 బిలియన్లను ఖర్చు చేయాలని బైడెన్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.అయినప్పటికీ పలు రాష్ట్రాలు నిధులను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైట్‌హౌస్ అధికారి తెలిపారు.

పెన్సిల్వేనియా, టెక్సాస్ సహా ఇతర ప్రాంతాల్లోని కొన్ని స్కూల్ డిస్ట్రిక్ట్స్ భద్రతా ప్రోటోకాల్‌లలో వ్యత్యాసాలు, పరిమితుల కారణంగా కోవిడ్ పరీక్షలకు అనుమతి పొందేందుకు ఎంతో కష్టపడ్డాయని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.దీనిపై సదరు వైట్‌హౌస్ అధికారి స్పందిస్తూ.

పాఠశాలలు తమ రాష్ట్ర ప్రభుత్వాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే వాటికి వనరులను అందించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు.మరోవైపు దేశంలో పాఠశాలల మూసివేత సమస్య రాజకీయంగా దుమారం రేపుతోంది.

వైట్‌హౌస్ గణాంకాల ప్రకారం.దేశవ్యాప్తంగా దాదాపు 96 శాతం పాఠశాలలు ఈ నెలలో వ్యక్తిగతంగా తరగతులు నిర్వహించాయి.

ఇది గతేడాదితో పోలిస్తే 46 శాతం పెరుగుదల.

New COVID-19 Rapid Tests To Arrive In US Schools This Week: White House , US Schools , White House, Omicron, Biden, US Centers For Disease Control And Prevention, Head Rochelle Valensky, Pennsylvania, Texas, - Telugu Biden, Covidrapid, Omicron, Pennsylvania, Texas, Centers Control, Schools, White #Shorts

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube