కాలిఫోర్నియా లో కొత్త జంట కొంప ముంచిన ఫోటో షూట్..!!  

New Couple Photoshoot ,California Beach , California, newly wedding couple, Wedding Photoshoot - Telugu California, California Beach, New Couple Photoshoot, Newly Wedding Couple, Wedding Photoshoot

పెళ్లి అనేది జీవితంలో ప్రతీ ఒక్కరికి ఎంతో ముఖ్యమైన విషయం. పెళ్లి చూపులు మొదలు అన్ని విషయాలు పదిలంగా బద్రపరుచుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు.

 New Couple Photoshoot California Beach

అందుకే పెళ్లి రోజునే కాకుండా పెళ్లి అయిన తరువాత కూడా ఫోటో షూట్ తీసుకుంటారు.ఇవే వారికి ఎంతో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి.

కొందరు రకరకాలుగా ఫోటో షూట్ తీసుకుంటారు.కొందరు అత్యంత ఎత్తైన కొండలమీద ఫోటో షూట్ చేసుకుంటారు.ఇంకొందరు ఆకాశంలో ఎగురుతూ ఫోటో షూట్ తీసుకుంటారు.ఈ క్రమంలోనే

కాలిఫోర్నియా లో కొత్త జంట కొంప ముంచిన ఫోటో షూట్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన ఓ జంట తమ భంధాన్ని కెమెరాలో భంధించాలని అనుకుంది.

పెళ్లి అవ్వగానే ఫోటో షూట్ కోసం కాలిఫోర్నియా లోని బీచ్ కి వెళ్ళింది.ఎత్తైన అలల మధ్య ఫోటో దిగాలని ఎంతో ఆరాట పడ్డారు.అనుకున్నట్టుగానే ఫోటో గ్రాఫర్ వారిని బీచ్ లో నీళ్ళకి దగ్గరగా ఉన్న రాయిపై నుంచోమని చెప్పాడు.ఫోటో గ్రాఫర్ చెప్పినట్టుగానే ఫోటో లకి ఫోజులు ఇస్తున్న జంటపై ఒక్క సారిగా భారీ అల దూసుకు వచ్చింది.దాంతో

అదుపు తప్పినా వధూవరులు సముద్రంలోకి పడిపోయారు.రక్షించండి అంటూ హాహాకారాలు చేస్తున్నారు.ఈ పరిస్థితులని గమనిస్తున్న స్థానికులు ఎంతో కష్టపడి వారిద్దరిని రక్షించారు.వారిద్దరిని రక్షిస్తుండగా తీసిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇలాంటి ఫోటో షూట్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాలిఫోర్నియా దగ్గర ఉన్న ఈ బీచ్ ఫోటో షూట్ కి ఎంతో ప్రసిద్ది అందుకే తరచుగా ఈ బీచ్ కి ఫోటో షూట్ కోసం జంటలు వస్తుంటారని అధికారులు తెలిపారు.

#California

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Couple Photoshoot California Beach Related Telugu News,Photos/Pics,Images..