ఇదెక్కడి పెళ్లి సామీ.. కరోనా దెబ్బకు అంతా మార్చేశారు!  

New Couple Mask Pehnaai - Telugu Mask Pehnaai, New Couple, Viral News, Wedding

కరోనా దెబ్బకు మనుష్యులు చాలా మారిపోయారు.ఇదివరకు విచ్చలవిడిగా తిరిగే జనం, ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

 New Couple Mask Pehnaai

ఇక మాస్క్‌లు వేసుకునేందుకు, సామాజిక దూరం పాటించాలంటే ఆమడ దూరం పారిపోయే జనం, ఇప్పుడు అది లేకుండా ఉండలేకపోతున్నారు.కాగా కరోనా దెబ్బకు వివాహాలు, శుభకార్యాలు చాలా వరకు తగ్గించారు జనం.అరకొర పెళ్లిల్లు మాత్రమే జరుగుతున్నా, వాటికి జనం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కాగా తాజాగా జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరి చూపులు తనవైపు తిప్పుకోవడమే కాకుండా కొత్త రకం పెళ్లికి నాంది పలికిందని పలువురి చేత అనిపించుకుంటోంది.

ఇదెక్కడి పెళ్లి సామీ.. కరోనా దెబ్బకు అంతా మార్చేశారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇటీవల అస్సాం రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పూలమాలలు మార్చుకోవాల్సిన వధూవరులు మూతికి కట్టుకునే మాస్క్‌లను మార్చుకున్నారు.ఒకరికి మరొకరు మాస్క్‌లు కట్టుకుని కరోనా సమయంలో ఆదర్శ జంటగా మారిపోయారు.

పూలదండలు మార్చుకునే ఆచారంతో పాటు మాస్కులు మార్చుకునే సరికొత్త ఆచారానికి ఈ జంట నాంది పలికింది.

అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ జనరేషన్‌కు వీరిద్దరే టార్చ్‌బేరర్లు అంటూ సరదాగా కొందరు అంటుంటే, మాస్కుల పెళ్లి అంటూ మరికొందరు అంటున్నారు.

ఏదేమైనా మున్ముందు ఇకపై దండలు మార్చుకోకపోయినా మాస్కులు మార్చుకోవాల్సిందేనంటూ పులువురు అంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test