కోవిడ్-19గా మారిన కరోనా వైరస్ వ్యాధి! ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడి చైనాలో వెయ్యి మందికి పైగా ఇప్పటి వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది ఇప్పటికే 43 వేల మంది వరకూ ఈ వ్యాధి బారిన పడ్డారు.రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ వైరస్ ని అదుపు చేయలేకపోతున్నారు.

 New Coronavirus Diseaseofficially Named Covid 19-TeluguStop.com

గత ఏడాది డిసెంబర్ లో ఈ వైరస్ వుహాన్ నగరంలో పుట్టింది.చైనా ఈ వైరస్ పై ఇప్పుడు పెద్ద యుద్ధమే చేస్తుంది.

ఈ వైరస్ కి ఎలాంటి చికిత్స, మందు లేకపోవడంతో మరింత విస్తరిస్తుంది.దగ్గు తుమ్ములు, శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా ఈ వ్యాధి చెందే అవకాశం ఉందంటే ఈ వైరస్ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ వ్యాధి కారణంగా చైనాలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు.

ఇండియాలో నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టారో అనేది ఈ ఘోరం చూస్తే అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ కి వలన వచ్చే వ్యాధికి కొత్త పేరు పెట్టింది.

ఇకపై ఈ వైరస్ వలన వచ్చే వ్యాధిని కోవిడ్-19గా పిలవాలని నిర్ణయించింది.కరోనా వైరస్ డిసీజ్ ని సంక్షిప్త రూపంగా ఈ పేరును డబ్ల్యూహెచ్ ఓ ఖరారు చేసింది.

ఇక ఇదే పేరుతో ప్రతి ఒక్కరు కరోనా వైరస్ వ్యాధికి ఇదే పేరు ఉపయోగించాలని తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube