జలుబు,దగ్గు,జ్వరమే కాకుండా ఈ లక్షణాలు ఉన్నా కూడా కరోనానేనట

కరోనా మహమ్మారి కేవలం ముక్కు కారడం,జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు వస్తాయి అని, ఇవే కరోనా లక్షణాలు అని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా యూరప్,అమెరికా దేశాల డెర్మటాలజిస్ట్ లు కొత్త విషయాన్నీ వెల్లడించారు.

 Corona,symptoms,coronavirus, Children,america,europe-TeluguStop.com

కరోనా లక్షణాల్లో టీనేజర్ల లో కొందరికి కాలి బొటన వెళ్లు,పాదాలు వాపులు వస్తున్నాయని,అవి కూడా కరోనా లక్షణాల్లో ఒకటిగా అక్కడి డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు.వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిన ప్రాణాంతక వైరస్‌ కరోనా ఇప్పుడు పసిపిల్లల పైనా దాడి చేస్తోంది.

యూరప్‌, అమెరికా దేశాల డెర్మటాలజిస్టులు టీనేజర్లలో కరోనా లక్షణాలను గుర్తించేందుకు వారి కాలి బొటనవేళ్లను పరీక్షించాలని చెబుతున్నారు.ఇటలీ డెర్మటాలజిస్టులు కూడా అదే మాట అంటున్నారు.

కరోనా వ్యాపించిన తొలినాళ్లలో చాలా మంది చిన్నారుల్లో పాదాలు, బొటనవేళ్లకు వాపులు వస్తాయని.రంగు వెలిసిపోతాయని వారు వెల్లడించారు.

అలాంటి లక్షణాలు ఉన్న అతి తక్కువమంది చిన్నారులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని వారు చెబుతున్నారు.

చిన్నారుల్లో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ‘కోవిడ్‌‌టోస్‌ టెస్ట్’ (బొటనవేలు పరీక్షించడం) దోహదపడుతుందని డెర్మటాలజిస్ట్ లు అంటున్నారు.

అమెరికన్‌ అకాడమీ డెర్మటాలజీ డాక్టర్ల అసోసియేషన్‌ తో పాటు న్యూయార్క్ వైద్యులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.‘కోవిడ్‌ టోస్‌’ఉన్న పిల్లలకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయాలని వారు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube