ఏపీలో కొత్తగా కరోనా నిర్ధారణ కేసులు.. ఎన్నంటే.. !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.చాపకింద నీరులా ఇక్కడ కోవిడ్ వ్యాపిస్తుంది.

 New Corona Diagnosis Cases In Ap, Andrapradesh, New Corona, Diagnosis, Cases, Co-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడించింది.అవెలా ఉన్నాయో తెలుసుకుంటే.

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయట.

ఒక్క రోజులోనే ఈ జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డట్లు వెల్లడించింది.ఇక తూర్పు గోదావరి జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కోవిడ్ కేసులు గుర్తించారట.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలియచేస్తున్నారు.

ఇకపోతే 70 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ప్రస్తుతం ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించారు అధికారులు.

కాగా ఇప్పటి వరకు ఏపీలో 8,89,210 పాజిటివ్ కేసులు నమోదు అవగా, 8,81,439 మంది కరోనా నుంచి విముక్తులయ్యారట.ఇంకా 604 మంది చికిత్స పొందుతుండగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,167 గా నమోదైందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube