తెలంగాణలో కొత్త కరోనా కేసులు @ 2,281  

telangana, corona, positive cases, deaths - Telugu Corona, Deaths, Positive Cases, Telangana

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రోజూ 2 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

TeluguStop.com - New Corona Cases In Telangana 2281

రికార్టు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

TeluguStop.com - తెలంగాణలో కొత్త కరోనా కేసులు @ 2,281-General-Telugu-Telugu Tollywood Photo Image

దేశాలు, రాష్ట్రాలు సమన్వయంగా ఉంటూ కరోనాతో పోరాడితే కరోనా కేసులను తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.

తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,281 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,83,866కి చేరింది.

నిన్న ఒక్కరోజే 11 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా… ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,091కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 30,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,52,441కి చేరింది.రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 58,925 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… ఇప్పటివరకూ నిర్వహించిన మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 28 లక్షలకు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.59 శాతంగా ఉందని, కేవలం రికవరీ రేటు 82.90 శాతంగా ఉందన్నారు.జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు.

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 316, కరీంనగర్ లో 106, మేడ్చల్ మల్కాజిగిరిలో 164, నల్గొండలో 141, రంగారెడ్డిలో 192 కరోనా కేసులు నమోదయ్యాయి.

#Positive Cases #Corona #Deaths #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Corona Cases In Telangana 2281 Related Telugu News,Photos/Pics,Images..