అమెరికాలో వారి ఎంట్రీకి కొత్త షరతులు..!!!

అమెరికా పౌరసత్వం పొందటమంటే అంత వీజీ కాదు.చాలా మంది ప్రవాసులు ఎన్నో ఏళ్ళుగా హెచ్-1 బీ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించి, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపేస్తూ ఉంటారు.

 New Conditions For Their Entry In America-TeluguStop.com

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అసలు గ్రీన్ కార్డ్ వస్తుందనే ఆశలు ఊహలలోకి కూడా రాలేదు.అయితే

అమెరికా రూల్స్ ప్రకారం ఏ దేశపు గర్భిణి అయినా సరే తాను ప్రసవించే సమయంలో గనుకా అమెరికాలో ఉంటే పుట్టిన బిడ్డకి అమెరికా పౌరసత్వం అక్కడి హక్కుల ప్రకారం వస్తుంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది గర్భిణులు టూరిస్ట్ వీసాతో వెళ్ళడం అక్కడ ప్రసవించడం దాంతో వారి బిడ్డలకి అమెరికా పౌరసత్వాన్ని పొందటం జరుగుతోంది.ఈ పరిస్థితులని గమనించిన ట్రంప్ సర్కార్ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపింది.

ఈ క్రమంలోనే అమెరికా వచ్చే గర్భిణులకి అక్కడి ప్రభుత్వం కొత్త వీసా ఆంక్షలు పెట్టనుందట.ఈ కొత్త నిభంధనల ముసాయిదాను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.ఈ నిభందనలు గనకా అమలు అయితే ఇకపై గర్భిణులు అమెరికాలో అడుగు పెట్టడం గగనమే అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube