ట్యాక్సీవాలా ఆశకు అంతే లేదు, విజయ్‌ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు  

విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా జోరు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. రేపు ‘2.ఓ’ చిత్రం రాబోతున్న నేపథ్యంలో ట్యాక్సీవాలా నేటితో సందడి తగ్గే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 35 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను దక్కించుకున్న ఈ చిత్రం పూర్తి సంతృప్తిగా థియేటర్ల నుండి వెనుదిరగొచ్చు అనుకుంటున్నారు. కాని ట్యాక్సీవాలా మేకర్స్‌ మాత్రం ఇంకా కలెక్షన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

New Comedy Scenes Added In Taxi Wala Movie-Taxi Movie Vijay Deverakonda

New Comedy Scenes Added In Taxi Wala Movie

2.ఓ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో తమ సినిమా జోరు తగ్గొదనే ఉద్దేశ్యంతో కొన్ని కామెడీ సీన్స్‌ యాడ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో కొత్త కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయడం వల్ల మరికొన్ని రోజులు అక్కడ సందడి చేయాలనేది చిత్ర యూనిట్‌ సభ్యుల ప్లాన్‌. అక్కడ మిలియన్‌ మార్క్‌కు ఈ చిత్రం చాలా దగ్గరగా వచ్చింది. అందుకే మరో ప్రయత్నం అన్నట్లుగా కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేశారు. 2.ఓ చిత్రం వచ్చిన తర్వాత కూడా కొత్త సీన్స్‌ కోసం ప్రేక్షకులు తమ సినిమాకు వస్తారనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

New Comedy Scenes Added In Taxi Wala Movie-Taxi Movie Vijay Deverakonda

ట్యాక్సీవాలా చిత్రం బడ్జెట్‌ కేవలం 5 కోట్లు. అంత తక్కువ బడ్జెట్‌తో నిర్మితం అయిన ఈ చిత్రం ఏకంగా 20 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సంతృప్తి చెందకుండా మరింత కలెక్షన్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రం మిలియన్‌ మార్క్‌ను సాధిస్తే విజయ్‌ దేవరకొండ దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. వరుసగా విజయ్‌ దేవరకొండ అమెరికాలో సాధిస్తూ ఉన్న వసూళ్లు చూసి ఇతర యువ హీరోలు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్యాక్సీవాలాను ఎలాగైనా మిలియనీర్‌ చేయాలనేది మేకర్స్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.