ఏపీ హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తి..!!

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేడు బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.

 New Chief Justice Of Ap High Court-TeluguStop.com

.మరి కొంతమంది అధికారులు హాజరయ్యారు.ప్రమాణ స్వీకారం అనంతరం.ప్రధాన న్యాయమూర్తి మిశ్రాకు.జగన్ పుష్ప గుచ్చం అందించి అభినందించారు.గతంలో చతిస్గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన.

మిశ్రా.పదోన్నతి పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రావడం జరిగింది.2009వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో చతిస్ ఘడ్ ప్రధాన న్యాయమూర్తి గా సేవలు అందించారు.

 New Chief Justice Of Ap High Court-ఏపీ హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1964 ఆగస్టు 29వ తారీకు నాడు మిశ్రా రాయగడ్ లో జన్మించారు.బిలాస్పూర్ లోని గురుఘసిదాస్ వర్సిటీ నుండి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.1987 సెప్టెంబర్ నాలుగున న్యాయవాది వృత్తి చేపట్టారు.2005 జనవరి నెలలో ఛత్తీస్‌గడ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదా పొందారు.బార్ కౌన్సిల్ చైర్మన్ గా పని చేశారు.హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడుగా పని చేశారు.2004 జూన్ 26 నుండి 2007 ఆగస్టు 31 వరకూ ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా సేవలు అందించారు.ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడవ చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ తన సేవలు అందించనున్నారు.

#Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు