నిరుద్యోగులే టార్గెట్ గా తెరపైకి వచ్చిన కొత్త మోసం.. !  

mancherial, new Cheating, targeting, unemployed - Telugu

సమాజంలో రోజు రోజుకు సరికొత్త రీతిలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటాం అనే చందాగా కేటుగాళ్లూ పుట్టుకొస్తున్నారు.

TeluguStop.com - New Cheating Came To The Fore Targeting The Unemployed

ఇక మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు నేరస్తులు.

ప్రజలు ఈ పరిస్దితుల్లో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా వారి జేబుకు చిల్లులు పడటం ఖాయం.

ఇక ప్రస్తుతం ఒక ప్రముఖ చానల్లో ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మంచిర్యాల పోలీసులు పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆముదాల సంపత్ రెడ్డి, పులి వెంకట్ రావు అనే ఇద్దరు యువకులు ఒక చానల్ నకిలీ గుర్తింపు కార్డ్‌లతో పాటుగా, ఆ న్యూస్ చానల్ లోగో, పేరు ఉపయోగించుకొని మంచిర్యాలలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తు నిరుద్యోగ యువతి యువకులను మోసం చేయాలని ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరపగా ఆ విచారణలో నేరం రుజువు అవ్వడంతో వారిని జైలుకు తరలించారు.

కాబట్టి ప్రతి వారు అపరిచితుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, ఎవరిపట్ల అయినా అనుమానం కలిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పోలీస్ అధికారులు తెలియచేస్తున్నారు.

#Unemployed #New Cheating #Targeting #Mancherial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు