మరింత సరికొత్తగా రాబోతున్న గూగుల్ పే…!  

New Changes in Google Pay App, google pay, new version, google, application, user interface, India, Singapore - Telugu Application, Google, Google Pay, India, New Changes In Google Pay App, New Version, Singapore, User Interface

టెక్నాలజీ పరంగా ప్రతి సంస్థ ఎప్పటికప్పుడు కొత్త రూపురేఖలను మార్చుకొని ముందుకు వెళుతూ ఉంటాయి.ఇక ఇందులో డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ అయిన గూగుల్ పే కూడా పూర్తిగా తన రూపు రేఖలను మార్చుకుంటూ అతి త్వరలోనే మన ముందుకి సరికొత్తగా కనబడబోతుంది.

TeluguStop.com - New Changes Google Pay Application

ఇందుకు సంబంధించి గూగుల్ సంస్థకు సంబంధించి సొంత యూజర్ ఇంటర్ ఫేస్ టూల్ కిట్ ద్వారా మార్పులను చేసి అటు ఆండ్రాయిడ్ యూజర్లకు, ఇటు ఐఓఎస్ యూజర్స్ కి ఒకేసారి అందించబడుతుంది.ఇక ఈ మార్పులకు సంబంధించి గూగుల్ సంస్థ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొత్త మార్పుల గురించి పూర్తి వివరణ తెలియజేశారు.

ఇక ఆయన అందించిన సమాచారం మేరకు అతి త్వరలో గూగుల్ పే వారి వినియోగదారుల కొరకు మరెన్నో కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చి రాబోతుందని, అయితే ఇది బీటా వర్షన్ తో ప్రారంభం అవుతోందని తెలిపారు.ప్రస్తుతం టెక్నాలజీలో అభివృద్ధి కారణంగా బయట మార్కెట్ కు తగ్గట్టుగా ఆధునిక సదుపాయాలతో పాటు మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా మార్పులను చేస్తున్నట్టు గూగుల్ తన బ్లాగ్ పోస్టులో మార్పులకు సంబంధించిన వివరాలని తెలియజేసింది.

TeluguStop.com - మరింత సరికొత్తగా రాబోతున్న గూగుల్ పే…-General-Telugu-Telugu Tollywood Photo Image

వీటితోపాటు ఇదివరకు ఉన్న గూగుల్ పే మొత్తం కోడ్ ను పూర్తిగా మారుస్తూ కొత్తరకమైన మార్పులను చేసి, కొత్త ఇంటర్ఫేస్ ను వినియోగదారులకు అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నారు.

అయితే, ఈ మార్పులను ప్రస్తుతానికి భారత్ అలాగే సింగపూర్ దేశాలలో ఈ బీటా ఛానల్ కు సంబంధించిన మార్పులను గమనించవచ్చని కంపెనీ తెలియజేసింది.

అయితే ఇప్పటికే గూగుల్ పే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్ లోడ్ చేయబడిన ఫైనాన్షియల్ టెక్నాలజీ యాప్ గా అవతరించిన విషయం తెలిసిందే.గూగుల్ పే భారత్ లో మొత్తం నాలుగు బ్యాంకుల తో కలిసి పనిచేస్తోందని, అలాగే గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది కూడా సంస్థ అధికారులు తెలియజేశారు.

అంతేకాదు, కొన్ని ఇతర ఆర్థిక సేవల నుండి కూడా గూగుల్ పే రుణాలు అందించడానికి సహకారం అందిస్తోంది.

#Google #User Interface #Google Pay #Application #Singapore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Changes Google Pay Application Related Telugu News,Photos/Pics,Images..