పవన్ వకీల్ సాబ్ విషయంలో కొత్త మార్పు..!!  

దాదాపు రెండు సంవత్సరాల పాటు వెండితెరపై కనిపించకుండా రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన పవన్ “వకీల్ సాబ్” తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్” పై మెగా అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.

TeluguStop.com - New Change In Pawans Vakeel Saab Case

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీగా ఉంది.మరోపక్క ఎప్పటిలాగానే ఈ టీజర్ తో సరికొత్త రికార్డులు సృష్టించాలని పవన్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు.ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి సరికొత్త మార్పు ఒకటి చోటు చేసుకున్నట్లు ఫిలిం వర్గాల టాక్.

TeluguStop.com - పవన్ వకీల్ సాబ్ విషయంలో కొత్త మార్పు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మేటర్ ఏమిటంటే “వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్ మొదటిలో జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా జెమినీ టీవీ వెనకడుగు వేయడంతో జీ తెలుగు “వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్ దక్కించుకునట్లుగా తెలుస్తోంది.

దాదాపు 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఒక శాటిలైట్ రైట్స్ మాత్రమేగాక థియేట్రికల్ రైట్స్ కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.

మొత్తంమీద చూసుకుంటే “వకీల్ సాబ్”  నిర్మాత దిల్ రాజు.భారీగానే లాభాలు పవన్ రీఎంట్రీ సినిమాతో సాధిస్తున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది.

#Vakeel Saab #Pawan Kalyan #Dil Raju #Venu Sriram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు