శ్రీలంకలో కొత్త నేతల ముందు ఆర్ధిక సవాళ్లు

శ్రీలంక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.పూర్వ అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్ష, పూర్వ పధాని మహింద రాజపక్స లు ఇతర మరో ఇద్దరు మంత్రులు కారణంగా అదఃపాతాళానికి వెలిపోయిన శ్రీలంక ను తిరిగి గాడిలో పెట్టడానికి తాజాగా సానుకూల వాతావరణంలో నేతలను ఎన్నుకున్నారు.

 New Challenges In Front Of Srilanka New Leaders Ranil Wickramasingey And Dinesh-TeluguStop.com

అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఝే, ప్రధానిగా దినేష్ గుణ వర్ధన నియమితులయ్యారు.ఆర్ధిక పరమైన గాయాలతో సతమతమవుతున్న శ్రీలంకను ఈ ఇద్దరి నేతలు ఏవిధంగా తిరిగి గాడిలో పెట్టగలరు?.ఎవరూ ఊహించని విధంగా ఏకంగా దేశాన్నే మింగేసిన నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా దినేశ్‌ గుణవర్ధన ఎన్నికయ్యారు.దేశ నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ప్రమాణస్వీకారం చేసారు.

తరువాత అంశం మంత్రివర్గం ఏర్పాటు.ఆ తంతు కూడా పూర్తయింది.

ప్రస్తుతం రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుణవర్ధన గతంలో విదేశాంగ, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశం వదిలి పారిపోయి ఎక్కడో తలచుకుంటూ, రాజీనామా చేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గణవర్ధనను హోంమంత్రిగా నియమించారు.

ఇపుడు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఎదురయ్యే సవాళ్లలో, ముఖ్యంగా ఆర్ధిక పరమైన ఇబ్బందులు.వాటిని అధిగమిస్తే ఇక అన్ని వ్యవహారాలు వాటంతట అవే సర్దుకు పోతాయి.

మరి ఆవిషయంలో ప్రధాన మంత్రి గుణవర్ధన తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికే తర్జన భర్జనలు జరుగుతున్నాయి.

శ్రీలంకలో ఇంతవరకూ ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మొదట మహింద రాజపక్స తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసారు.

ఆ తర్వాత ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడంతో గొట్టబాయ కూడా దేశం విడిచి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసారు.

Telugu Challenges, Primeminster, Rajapaksa, Srilanka-Political

అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.వెళ్తూ వెళ్తూ తన సన్నిహితుడైన రణిల్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.ఈనేపథ్యంలోనే పూర్తి స్థాయి అధ్యక్షుడి కోసం ఇటీవల పార్లమెంటలో ఎన్నిక జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఈ ఎన్నికలో రణిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇది ఇంతవరకూ జరిగిన కథ.

ఇక ప్రస్తుతానికి వస్తే .ప్రధాని సింహాసనం నుంచి అధ్యక్ష సింహాసనం లోకి మారిన రణీల్ సింఘే తదుపరి కార్యక్రమం వైపు దృష్ఠి సారించారు.ఆయన వదిలేసిన ప్రధాని పదవిని భర్తీ చేసేందుకు గుణ వర్ధనేను ఎంచుకున్నారు.

ఆయనైతే తన అడుగుజాడల్లో నడుస్తాడనే వాదనలు పలువురిలో వినిపిస్తున్నాయి.ఎందుకంటే రాజపక్స కుటుంబానికి గుణ వర్ధన అత్యంత సన్నిహితుడు కావడమే అందుకు ప్రధాన కారణం.

మరి ఎటొచ్చి ఇపుడు ఎమడమ చేయి కాదు, పుర చేయి అన్న చాందాన శ్రీలంక ఎన్నికలు జరిగాయా అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

Telugu Challenges, Primeminster, Rajapaksa, Srilanka-Political

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇప్పటికీ ప్రజలు ఆకలితో మల మలా మాడిపోతున్నారు.దాంతో.ప్రజాగ్రహం ఆకాశాన్నంటింది.

గత కొని దశాబ్దాలుగా శ్రీలంకను ఏలుతున్న రాజ పక్ష కుటుంబం ఇంతటి దారుణానికి వడిగట్టడం, నిజంగానే శ్రీలంక ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.దేశ వ్యాప్తంగా ఉప్పెనలా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలు ఫలితంగా రాజపక్స కుటుంబం గద్దె దిగాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.ఇపుడు ప్రపంచ ప్రజల ముందే కాదు, ప్రస్తుతం శ్రీలంక ప్రజల్లో నూ నిలువునా తొలిచేస్తున్న పలు సందేహాల్లో ఒకటైన రాజ పక్ష కుటుంబం.

తాజాగా ఎన్నికైన నేతలు కూడా రాజపక్స సన్నిహితులు కావడం లంకేయుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.విక్రమసింఘెను ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని ఆందోళనకారులకు అసలు నచ్చలేదు.ఫలితంగా పలుచోట్ల భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.శ్రీలంక రాజకీయాలను గొటబాయ కుటుంబం తెర వెనక నుంచి నడిపిస్తోందన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube