సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొత్త స‌వాల్‌...!

త్వ‌ర‌లో జ‌రిగే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింద‌ని తెలుస్తోంది.అభ్య‌ర్థి ఎంపిక‌లో టీఆర్ఎస్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్‌తో పాటు సామాజిక వ‌ర్గాల వారీగా అన్వేష‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

 New Challenge For Trs In Sagar By Elections, Sagar, Trs, Election, Challenge, No-TeluguStop.com

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య మృతి చెంద‌డంతో త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ కురువృద్ధుడు అయిన జానారెడ్డికి మంచి ప‌ట్టు ఉంది.

అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో మంచి చైత‌న్యం కూడా ఉంది.దీంతో ఇప్పుడు ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక టీఆర్ఎస్‌కు క‌త్తిమీద సాములా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సింహ‌య్య జానాపై 7 వేల మెజార్టీతో విజ‌యం సాధించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.ఇక్క‌డ జానా రెండు సార్లు ఓడిపోగా రెండు సార్లు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల చేతుల్లోనే ఓడిపోయారు.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన టీఆర్ఎస్ దుబ్బాక స్థానం కోల్పోవ‌డంతో ఇప్పుడు ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక టీఆర్ఎస్‌కు టెన్ష‌న్‌గా మారింది.దుబ్బాక‌లో మృతి చెందిన రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణికి సీటు ఇచ్చిన టీఆర్ఎస్ ఓడిపోయింది.

Telugu Bc, Congress, Dubbaka, Jana Reddy, Nagarjuna Sagar, Sagar, Telangana-Telu

దీంతో సాగ‌ర్‌లో అలాంటి పొర‌పాటు రిపీట్ కాకూడ‌ద‌ని గులాబీ వాళ్లు భావిస్తున్నారు.అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కారు పార్టీకి బ‌ల‌మైన నేత లేరు.నోముల స్థానికేత‌రుడు అయినా ఆయ‌న వ్య‌క్తిత్వం, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న్ను గెలిపించాయి.ఇప్పుడు ఆయ‌న కుటుంబానికి సీటు ఇస్తే వాళ్లు అక్క‌డ ఏ మేర‌కు పోరాడి గెలుస్తారు ? అన్న‌ది సందేహ‌మే.పైగా ఆయ‌న కుమారుడిపై చాలా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఇక దుబ్బాక‌లో కుటుంబానికే సీటు ఇచ్చి చేదు ఫ‌లితం రావ‌డంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఆ సాహసం చేసేందుకు రెడీగా లేదు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి  ఉపఎన్నికలో పోటీకి ఆసక్తి చూపుతారో లేదో తెలియదు.మ‌ళ్లీ నాన్‌లోక‌ల్ అభ్య‌ర్థిరి రంగంలోకి దిగితే వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న టాక్ ఉండ‌గా….టీఆర్ఎస్ బీసీ అస్త్రం ప్ర‌యోగిస్తే ఎలా ? ఉంటుందా ? అన్న ఆలోచ‌న‌లో కూడా ఉంది.ఏదేమైనా ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు ప్ర‌తిష్ట‌గా మార‌డంతో క్యాండెట్ ఎంపిక పెద్ద స‌వాల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube