ఇకపై క‌థ వేరుంటదంటున్న సోహెల్..!

బిగ్ బాస్ షోలో పాల్గొనక ముందు సోహెల్ కేవలం కొద్దిపాటి సినిమాలలో, అక్కడ అక్కడ సీరియల్స్ లో చిన్న చితకా క్యారెక్టర్ రోల్స్ లో నటించాడు.ఇలా ఎన్ని పాత్రలలో నటించిన అతడికి మాత్రం పెద్ద గుర్తింపు మాత్రం లభించలేదు.

 Bigg Boss Four Contestant Sohail Bought New Car, Sohail, Bigboss, New Car, Vira-TeluguStop.com

అతడు బిగ్ బాస్ లో ఎప్పుడైతే అడుగు పెట్టడం సోహెల్ అంటే ఇతనే అన్నట్లుగా అందరికీ గుర్తుండిపోయారు.బిగ్ బాస్ కార్యక్రమంతో అతడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

ఇదివరకు సోహెల్ అంటే ఎవరో తెలియని వారందరూ ఇప్పుడు చిన్నపిల్లాడి నుండి పెద్దవారి వరకు సోహెల్ అంటే ఇతడే అన్నట్లుగా సుపరిచితుడు అయిపోయాడు.

బిగ్ బాస్ షోలో టాప్ 3 కంటెస్టెంట్ లో ఒకడిగా నిలబడిన సోహెల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక సోహెల్ పలు ఇంటర్వ్యూలు, షో లు, సినిమాలు ఇలా ప్రతి క్షణం ఏదో ఒక పని చేసుకుంటూ బిజీ లైఫ్ గడిపేస్తున్నాడు.

అయితే తాజాగా అతడు బిగ్ బాస్ దయవల్ల తను కన్న కల తీరిందని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.ఇందుమూలంగా అతడు తన తండ్రితో కలిసి తాను కొన్న కొత్త కారుతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు.

ఇందులో భాగంగానే మానాన్న నాకు ఆదర్శం ఆయన బ్లెస్సింగ్స్ వాళ్ళనికారు కొనడం సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు.దీంతోపాటు కథ  వేరు ఉంటుందని అందుకు ట్యాగ్ తెలియజేశాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 4 నుండి బయటకు వచ్చాక సోహెల్ కథ పూర్తిగా మారిపోయింది.మెగాస్టార్ చిరు లాంటి స్టార్ సెలబ్రిటీ ఇంటినుండి అతడికి ప్రత్యేకంగా బిర్యాని వండి పెట్టి మరి అతడి కోసం ఇవ్వడంతో అతడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.అంతేకాదు అనేక మంది సినిమా పెద్దలు అతడికి ఆఫర్స్ ఇవ్వడానికి క్యూ కడుతున్నాయి.దీన్ని బట్టి చూస్తే సోహెల్ జీవితంలో ముందు ముందు రోజులు కథ మామూలుగా ఉండేలా కనబడట్లేదు.

ఏది ఏమైనా సోహెల్ కి ఆల్ ది బెస్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube