టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్.. సెలెక్ట్ అయిన మిగతా ప్లేయర్లు వీరే..

ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది.డిసెంబర్ 26న మొదలైన టెస్ట్ సిరీస్ జనవరి 15వ తేదీతో ముగుస్తుంది.

 New Captain For Team India Odi Team  Team India, Capitan, Rahul, Sports News, So-TeluguStop.com

ఆ తర్వాత జనవరి 19, 2022న మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.అయితే ఎడమ తొడ గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా నీరసం గానే ఉన్నాడు.

గాయం నుంచి కోలుకున్నా.పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోతున్నాడు.

దీనితో రోహిత్ మళ్లీ టీంలోకి రావాలంటే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అతన్ని పక్కనపెట్టేసింది బీసీసీఐ.

రోహిత్ కు బదులుగా కేఎల్ రాహుల్ ను వన్డే కెప్టెన్‌గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ.సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాకు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించింది.

అలాగే 18 మందితో కూడిన వన్డే జట్టును తాజాగా బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.వారెవరో తెలుసుకుంటే.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడే టీమిండియా జట్టిదే.

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌.

Telugu Bhumrah, Capitan, Rahul, Rohit Sharma, Africa, India-Latest News - Telugu

ఇకపోతే తొలి, రెండో వన్డే జనవరి 19, 21న పార్ల్‌లో జరగనున్నాయి.ఇరు జట్లు మూడో వన్డేను జనవరి 23న కేప్‌టౌన్‌లో ఆడనున్నాయి.రోహిత్ శర్మ 100% రికవరీ అయ్యేంతవరకు బీసీసీఐ వేచి చూడనుంది.ఎందుకంటే త్వరలోనే కీలకమైన వరల్డ్ కప్ ఈవెంట్స్ జరగనున్నాయి.రోహిత్ శర్మ మంచి బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు ఇప్పుడు టీ20, వన్డే టీంలకు మంచి కెప్టెన్ కూడా.అత్యంత కీలక ప్లేయర్‌గా ఉన్న రోహిత్ శర్మకు సరిపడా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

అలాగే ఈసారి కొత్తగా కొందర్ని చేర్చుకుంటే.కొందరిని వన్డే జట్టు నుంచి తొలగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube