మహేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ కొట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

 New Buzz On Mahesh Babu Trivikram Movie, Mahesh Babu, Trivikram, Rajamouli, Sark-TeluguStop.com

కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా పూర్తి కాకముందే మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు.

గతంలో అతడు, ఖలేజా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన మహేష్-త్రివిక్రమ్ కాంబో, ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు చూస్తూనే, మహేస్ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా చూస్తున్నాడట ఈ డైరెక్టర్.

ఇక ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని, నవంబర్ నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబో అదిరిపోయే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube