సరికొత్త వ్యాపారం: గట్టిగా కౌగిలించుకుంటే 7300 రూపాయలు..!

కరోనాను అంతం చేసే క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పెట్టాయి.అయితే ఈ లాక్ డౌన్ల వల్ల చాలా సంస్థలు మూత పడ్డాయి.

 New Business Of Hugging With Price Of 7300 Rupees In America, New Business, Hug-TeluguStop.com

జనజీవం ఇంటికే పరిమితమవ్వడం వల్ల చాలా మంది బయటతిరగలేదు.దీంతో షాపింగ్ మాల్స్, స్టాల్స్, థియేటర్లు, కంపెనీలు, ప్రయివేటు సెక్టార్లు తమ సంస్థలను మూసుకోవాల్సి వచ్చింది.

ఆర్థిక స్థితి మందగించింది.దీంతో ఎందరో ఉద్యోగాలు పోయి రోడ్డున పడాల్సి వచ్చింది.ఇలాంటి టైంలో కరోనా కాటుకు చాలా మంది కన్నుమూశారు.ఇంకొందరు బతకలేక ప్రాణాలను విడిచారు.మరికొందరు బలవన్మరణాలు పొందారు.ఇటువంటి నేపథ్యంలో కౌగిలింతల బిజినెస్ ఎంతో సాఫీగా సాగుతోంది.

బాధతో ఉన్నవారికి ఓదార్పు నివ్వాలంటే కచ్చితంగా వారిని కౌగిలించుకోవాలి.వారి బాధను పాలుపంచుకోవాలి.

అలాంటి ఐడియానే ఇప్పుడు ఓ చోట పాటిస్తున్నారు.కౌగిలింతల వ్యాపారం చేసి డబ్బులు దండుకుంటున్నారు.

నా అనే వాళ్లు లేనప్పుడు చాలా మంది బాధపడిపోతుంటారు.తమ బాధ చెప్పుకోవడానికి తమని ఓదార్చడానికి ఒక్కరైనా అవసరం ఉంటుంది.అలాంటి సమయంలో ఎవరినైనా ఆప్యాయంగా కౌగిలించుకోవడం, వారి భుజాలపై తలవాల్చి ఊపిరిపీల్చుకోవాలనుకోవడం మామూలుగా అవసరం అవుతుంది.ఇది మానవునికి కచ్చితంగా కావాల్సిన అంశం.

నేటి పోటీ ప్రపంచం ఇప్పుడు కరోనా ప్రపంచంగా మారిపోయింది.తమ గోడును చెప్పుకునేవారు లేకపోవడం వల్ల వారు బాధతో విలవిల్లాడుతున్నారు.

Telugu America, Chicago, Corona, Hug, Kelly, Lock, Latest-Latest News - Telugu

ఇటువంటి టైంలోనే వృత్తిపరంగా కౌగిలించుకునే వాళ్ళు ఎక్కువవుతున్నారు.బాధల్లో ఉన్న వ్యక్తులకు కాసింత ఉపశమనం అందించడానికి కౌగిలింతలు ఇస్తూ ధనార్జన పొందుతున్నారు.అమెరికాకి చెందిన కీలీ షౌప్ అనే మహిళ కౌగిలింతల వ్యాపారంలో చేస్తూ డబ్బులు పొందుతొంది.ఆమె గంటకి 7300 రూపాయలు వసూలు చేయడం విశేషమనే చెప్పాలి.కీలీ షౌప్ తన కాంట్రాక్టులో రూల్సు చాలా కఠినంగా ఉంటాయని, చికాగోకి చెందిన కీలీ వద్దకి వచ్చే కస్టమర్లు, దీర్ఘకాల ఇబ్బందులతో మానసిక బాధలతో ఉంటారని ఆమె తెలిపింది.అయితే కొందరికి కలిగే శృంగారం గురించి అభ్యర్థనలను వారు ఒప్పుకోమని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube