10.30 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి.. కొడాలి నాని

10.30 కోట్ల వ్యయంతో గుడివాడ ఏరియా ప్రభుత్వా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం.రోగులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు( నాని) చెప్పారు.శుక్రవారం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు.

 New Building In Guduvada Area Government Hospital Over 10 Crores Of Investment S-TeluguStop.com

ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో   మెరుగైన సేవలు అందర పరిస్థితి ఏర్పడిందన్నారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శిధిలమైన భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుండి 10.30 కోట్ల నిధులను మంజూరు చేయించానన్నారు.టెండర్లను మెగా ఇంజనీర్ సమస్త దక్కించుకుందని ఈ ఏడాది పనులు ప్రారంభమవుతాయని భవన నిర్మాణం పూర్తయితే ఒకేచోట మెరుగైన ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలు అందించవచ్చని అన్నారు.

ఇదిలా ఉండగా గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నామన్నారు.

Telugu Covid Ward, Guduvada Area, Icu Beds, Kodali Nani-Political

ఇప్పటివరకు ఆక్సిజన్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.ఆక్సిజన్ ప్లాంట్ కేటాయించాలని తాను కోరడంతో అదామా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌత్ ఇండియాలో మొదటి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్ ను అందజేసిందన్నారు.కోరినా సెకండ్ డే సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు.

థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ఆక్సిజన్ బ్లేడ్లు సామర్థ్యంతో వార్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు వీటితోపాటు 10 ICU.బెడ్లు ఉంటాయని తెలిపారు.ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube