ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు, ఆస్తులు వ్యామోహంలో పడి మానవ సంబంధాలకి పెద్దగా విలువ ఇవ్వడం లేదు.కాగా ఇటీవలే పెళ్లయి పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే వరుడు తన అత్తింటి వాళ్ళని గొంతెమ్మ కోరికలు కోరడం మొదలు పెట్టాడు.
దీంతో వధువు ఏకంగా వరుడిని చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే అమేటి గ్రామంలో ఇమ్రాన్ సాజ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.
అయితే ఇటీవలే ఇమ్రాన్ సాజ్ కి అతని దూరపు చుట్టమయిన ఓ యువతితో వివాహం జరిగింది.పెళ్లయి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఇమ్రాన్ తన అత్తింటి వాళ్ళని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొనివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.ఈ క్రమంలో వధువు వరుడు కుటుంబ సభ్యుల మధ్య మరోమారు గొడవ జరగడంతో వధువు ఏకంగా చెప్పు తీసుకొని కొట్టింది.
దీంతో వరుడు తరపు బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై వధువు తరపు బంధువులపై దారుణంగా దాడి చేశారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడి తరపు బంధువులను మరియు వరుడుని కూడా అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.