దారుణం : డాక్టర్‌ అజాగ్రత్త వల్ల తల్లి కడుపులోని బిడ్డకు కత్తి గాయం

దేవుడి తర్వాత అంతటి వారిగా డాక్టర్‌లకు పేరు ఉంది.కొందరు దేవుళ్లను నమ్మకున్నా కూడా డాక్టర్లను నమ్ముతారు.

 New Born Baby Get Gashon Her Face-TeluguStop.com

డాక్టర్లనే దేవుడిగా భావిస్తారు.తమకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా దేవుడి కంటే ముందు డాక్టర్‌ వద్దకు వెళ్తారు.

ఆ తర్వాత దేవుడి వద్దకు వెళ్లి చల్లగా చూడమంటూ కోరుకుంటారు.ఈ సమాజంలో డాక్టర్‌కు దేవుడితో సమానమైన హోదా ఉంది.

అలాంటి డాక్టర్‌ తన బాధ్యతను నిర్వర్తించే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేవుడు తనను నమ్ముకున్న వారిని చల్లగా చూసినట్లుగా డాక్టర్‌ కూడా తనను నమ్ముకుని వచ్చిన వారిని జాగ్రత్తగా ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలి.

Telugu Doctors, Bornbaby, Russiahospitals, Russiapregnant, Weston Russia, Telugu

  కాని ఈమద్య కాలంలో కొందరు డాక్టర్లు దారుణంగా తయారు అవుతున్నారు.ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం.ఆపరేషన్‌ చేసి అందుకు సంబంధించిన వస్తువులు లోపల ఉంచి కుట్లు వేయడం ఒక చోట ఆపరేషన్‌ చేయాల్సింది మరో చోట ఆపరేషన్‌ చేయడం ఒక ఆపరేషన్‌ చేయాల్సింది మరో ఆపరేషన్‌ చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.ఇప్పుడు నేను చెప్పబోతున్న డాక్టర్‌ చేసిన పని మరీ దారుణం.

తల్లి కడుపులో ఉన్న బిడ్డకు కత్తి గాటు పెట్టాడు.

Telugu Doctors, Bornbaby, Russiahospitals, Russiapregnant, Weston Russia, Telugu

  సౌత్‌ వెస్టన్‌ రష్యాలోని కష్యతమ్‌ పట్టణంలో 19 ఏళ్ల దర్య కడోచ్నికోవా ప్రెగ్నెంట్‌.నెలలు నిండిన తర్వాత కూడా పెయిన్స్‌ రాకపోవడంతో స్థానిక హాస్పిటల్‌లో డాక్టర్‌ సిజేరియన్‌ చేసి బేబీని తీయాలని చెప్పాడు.అందుకు ఓకే చెప్పిన ఆమె ఆపరేషన్‌కు సిద్దం అయ్యింది.

ఆపరేషన్‌ అంతా సజావుగా సాగిందనుకున్న సమయంలో తన బిడ్డను చూసుకుని ఆమె షాక్‌ అయ్యింది.కూతురు పుట్టింది, పుట్టిన కూతురుకు కంటికి కింద బాగంలో చెంపై కత్తితో ఇంచున్నర మందు కత్తి గాటు ఉంది.

ఆపరేషన్‌ సమయంలో ఆ గాయం అయినట్లుగా హాస్పిటల్‌ సిబ్బంది ఆమెకు చెప్పడం జరిగింది.దాంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.డాక్టర్‌ మరీ ఇంత అలసత్వంతో ఎలా ఉంటారంటూ ప్రశ్నించింది.ఎంతో ముద్దుగా పుట్టిన ఆ పాపకు ఇలా కత్తి గాయం మొహంపై అవ్వడంతో అంతా కూడా అయ్యో అంటున్నారు.

మీరే చూడండి అందమైన ఆ అమ్మాయి మొహంపై కత్తిగాయం ఎంత దారుణంగా ఉందో.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube