పుట్టిన బిడ్డలు చనిపోయారని కవర్ లో చుట్టి ఇచ్చిన డాక్టర్లు, తీరా చూస్తే ...?

అప్పుడే జన్మించిన బిడ్డలు చనిపోయారని చెప్పి ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టచుట్టి తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యులు.ఈ సంఘటనతో మరోమారు ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ధోరణి బయటపడింది.

 New Born Baby,bhadrachalam,govtdoctors, New Born Babies Alive After Dead,plastic-TeluguStop.com

అలా అందజేసిన బిడ్డ కొద్దిసేపటి తర్వాత కదిలాడు.ఇక దీంతో మరోసారి బిడ్డని తీసుకొని తల్లిదండ్రులు హాస్పిటల్ కు పరిగెత్తారు.

ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి కి చెందిన సునీత అనే వివాహిత కు కేవలం ఆరు నెలల్లోనే పురిటినొప్పులు వచ్చాయి.అయితే లాక్ డౌన్ సమయం కారణంగా వారు భద్రాచలం లో ఉండాల్సి వచ్చింది.

దీంతో ఆమెను భద్రాచలంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.అయితే అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి కడుపులో కవల పిల్లలు ఉన్నారని వారి పరిస్థితి ఏమి బాగా లేదని వెంటనే అబార్షన్ చేయకపోతే తల్లికి కూడా ప్రమాదమే అని చెప్పగా, దాంతో భార్యాభర్తలు భయపడి వేరే దారి లేక అబార్షన్ చేయమని చెప్పగా… డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేశారు.

అబార్షన్ చేసిన తర్వాత డాక్టర్లు ఇద్దరు పిల్లలను బయటకు తీశారు.

అలా బయటకు తీసిన పిల్లలు చనిపోయారని చెప్పి ఓ ప్లాస్టిక్ కవర్ లో ఇద్దరు శిశువులను పెట్టి భార్య భర్తల కు అందజేశారు.

ఇలా అందజేసిన తర్వాత భార్య భర్తలు ఇంటికి శోకసంద్రంలో బయలుదేరగా, దారి మధ్యలోనే కవలలో ఒకరైన మగ శిశువు కదలడంతో వారు ఉలిక్కి పడ్డారు.దీంతో వెంటనే వారు ఆ కవర్ ను తీసుకొని తిరిగి హాస్పిటల్ కు చేరుకొని అక్కడ డాక్టర్లకు విషయం మొత్తం చెప్పడంతో వెంటనే అక్కడి వైద్యులు అప్రమత్తమై బిడ్డకి చికిత్స అందజేశారు.

అబార్షన్ చేశాక పిల్లలు బతికున్నారో లేదో అని చూడకుండా మాంసం ముద్దగా కవర్ లో చుట్టి ఇవ్వడంపై గర్భిణీ బంధువులు డాక్టర్ ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube