బుల్లితెరపై ఆకట్టుకుంటున్న కొత్త జోడి...  

New Anchor Jodi In Tollywood Small Screen - Telugu Anchor Varshini, Anchors Jodi, Hyper Aadi, Jodi Anchors, Jodi News, Tollywood Anchors, Tollywood News Dee Jodi

టాలీవుడ్ లో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రతి బుధవారం ప్రసారమయ్యే డీ జోడి డాన్స్ షో ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనవసరం లేదు.ఈ చిత్రం టిఆర్పి రేటింగ్ పరంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ డాన్స్ షో గా దూసుకుపోతుంది.

New Anchor Jodi In Tollywood Small Screen

అంతేగాక యూట్యూబ్లో కూడా ఈ డాన్స్ షో కి సంబంధించినటువంటి వీడియోలు ట్రెండింగ్ వీడియోల సరసన నిలుస్తున్నాయి.అయితే ఈ డాన్స్ షోలో పాల్గొంటున్నటువంటి కంటెస్టెంట్లకి టీం లీడర్లు గా సుధీర్ – రష్మి, యాంకర్ వర్షిని – హైపర్ ఆది ఉన్నారు.

అయితే తాజాగా గత వారం ప్రసారమయిన ఎపిసోడ్లో హైపర్ ఆది మరియు యాంకర్ వర్షిని “మనోహరా” అనే పాటకి చేసిన డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.జబర్దస్త్ కామెడీ షోలో తన పంచులతో ఆకట్టుకునే హైపర్ ఆది ఈసారి మైమరిపించే రొమాంటిక్ స్టెప్పులతో ప్రేక్షకులను బాగా అలరించాడు.

దీంతో నెటిజన్లు హైపర్ ఆది చేసినటువంటి ఈ డాన్స్ వీడియోని బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేకాక బుల్లితెరకి మరో యాంకర్ జంట దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హైపర్ ఆది అభిమానులైతే మాత్రం ఆది అడుగుపెడితే అదిరి పోవాల్సిందే అది స్కిట్ అయినా, డాన్స్ అయినా అంటూ హైపర్ ఆది ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అయితే గతంలో సుధీర్ రష్మీ చేసినటువంటి డాన్సులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో షో నిర్వాహకులు ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు టీమ్ లీడర్లతో డాన్సులు చేయిస్తూ షో నీ మరింత ఆసక్తి కరంగా రక్తి కట్టిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా హైపర్ ప్రస్తుతం పలురకాల ఈవెంట్లు, షోలు నిర్వహిస్తూ మరోపక్క కమెడియన్ గా  చేస్తూ బిజీబిజీ గా గడుపుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Anchor Jodi In Tollywood Small Screen Related Telugu News,Photos/Pics,Images..

footer-test