అలాంటి మగవారంటే చెడ్డ చిరాకు అమ్మాయిలకు

ఒకరి అలవాట్లు ఒకరి నచ్చకపోవచ్చు.ఒకే అలవాటు ఇద్దరికి ఉండకపోవచ్చు.

అక్కడే అభిప్రాయ భేదాలు వస్తాయి.ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు అలాంటి సమయంలో నీతివాక్యాలు మాట్లాడవచ్చు.

కొందరికైతే మరొకరి అభిప్రాయలను, అలవాట్లను తప్పుపట్టడమే పనిగా పెట్టుకుంటారు.అలాంటివారితోనే చిక్కు.

అందులోనూ అబ్బాయిలు అమ్మాయిలపై అధికారం చెలాయించే పని చేస్తే అది మరింత ఎబ్బెట్టుగా ఉంటుంది.బాయ్ ఫ్రెండ్ క్లాసు పీకుతుంటే ఏ అమ్మాయికి మాత్రం వినాలని ఉంటుంది

* నీ అలవాటు ఏం బాగాలేదు.

అలాంటి బట్టలు వేసుకోకు.నువు చూసే షో అస్సలు బాగోదు.అదేం టేస్ట్ నీది అనే మాటలు ఒకటిరెండు సార్లు, సరదాగా అంటే పర్లేదు కాని, ప్రతీ చిన్న అలవాటుని తప్పుపట్టవద్దు

* ఎవరి కంఫర్ట్ జోన్ వారిది.ఆ కంఫర్ట్ జోన్ దాటుకోని మీ జోన్ లోకి రావాలని ఇబ్బంది పెట్టడం అణవివేత లాంటిదే

* వేదాంతం చెప్పినట్లు, ఇది మంచి, అది చెడు అంటూ క్లాసు పీకే మగవారంటే నిజంగానే అమ్మాయిలకు చిరాకు

* ఆ వస్తువుకి ఇంత ఖర్చుపెట్టడం అవసరమా అనే టాపిక్ ఎప్పుడు తీసుకురావద్దు.ఆమెకి ఆనందం ఇచ్చే వస్తువేమో అది.మీ అలవాట్లపై మీరు కూడా ఖర్చుపెడతారు కదా.ఖరీదైన మద్యం తాగితే మగవారికి అదో సంతృప్తి, అలాగే ఖరీదైన బట్టలు కొంటే ఆడవారికో సంతృప్తి .ఆ విషయం అర్థం చేసుకుంటే చాలు.ఇద్దరు కలిసి ఖర్చులు తగ్గించాలనుకునే నిర్ణయం తీసుకుంటే అది మంచి విషయమే

* ఎదుటి వ్యక్తి తప్పులు అదేపనిగా ఎత్తి చూపవద్దు.మీలోను తప్పులుంటాయి.వాటిని ఎదుటివారు అదేపనిగా గుర్తుచేస్తే ఎలా అనిపిస్తుందో ఓ నిమిషంపాటైనా ఆలోచిస్తే చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube