ఇతరుల చేతి నుంచి ఈ వస్తువులను తీసుకుంటే...దురదృష్టం వెంట వస్తుంది

సాధారణంగా ఇతరుల చేతి నుండి కొన్ని వస్తువులను తీసుకోకూడదు అని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.కానీ కొన్ని తెలిసి తీసుకుంటాం.

 Never Take These Things From Others-TeluguStop.com

కొన్ని వస్తువులను మనకు తెలియకుండానే తీసుకుంటూ ఉంటాం.ఆ విధంగా తీసుకోవటం వలన అనేక నష్టాలను, దారిద్య్రాలను ఏరి కోరి తెచుకున్నట్టు అవుతుంది.

అయితే కాలం మారిన సరే ప్రజల్లో కొన్ని ఆచారాలు,నమ్మకాలు,సంప్రదాయాలు అలానే ఉండిపోయాయి.ఈ నమ్మకాలకు శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణ లేనప్పటికీ పెద్దవారు చెప్పారు కాబట్టి అని పాటిస్తూ ఉంటారు.

ఇప్పుడు ఏ వస్తువులు ఇతరుల నుండి తీసుకుంటే మంచిది కాదో వివరంగా తెలుసుకుందాం.వంట చేస్తున్నప్పుడు పక్కన ఉన్నవారిని కారం అందుకో అని అనడం చూస్తూనే ఉంటాం.ఆలా కారం అందుకోకూడదు.అలాగే నల్ల నువ్వులు,నువ్వుల నూనె,ఆయిల్స్ ఒకరి చేతి నుండి తీసుకోకూడదు.

వాటిని కింద పెట్టమని చెప్పి అప్పుడు మాత్రమే తీసుకోవాలి.నల్లని వంకాయలు ఒకరి చేతి నుంచి అసలు తీసుకోకూడదు.

ఎందుకంటే నల్లని వంకాయలు శనీశ్వరునికి చాలా ఇష్టం.

ఇంటిలో పూజలు చేస్తున్న సమయంలో ఏదైనా వస్తువు కావలసినప్పుడు ఆకు మీద పెట్టి ఇవ్వమని చెప్పాలి.ఆలా కాకుండా డైరెక్ట్ గా తీసుకుంటే పూజ చేసిన ఫలితం రాదు.నవరత్నాల ఉంగరాన్ని ఎవరి చేతి నుంచి తీసుకోకూడదు.

పక్కన పెడితే అప్పుడు తీసుకోవాలి.ఒకవేళ వారి నుంచి నవరత్నాల ఉంగరాన్ని డైరెక్ట్ గా తీసుకుంటే వారి నుంచి నెగిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది.

అలాగే చింతపండు,ఆవాలు కూడా తీసుకోకూడదు.ఆలా తీసుకుంటే జేష్ఠా దేవి వస్తుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube