అమ్మాయిని ఆరకంగా మాత్రం పడేయ్యాలని ప్రయత్నించొద్దు

డేటింగ్ సైట్లు , ఫేస్ బుక్ , ట్విట్టర్ వచ్చాక, అబ్బాయిలకి అమ్మాయిలకి దూరం చాలా తగ్గిపోయింది .ఒకప్పుడు క్లాసులో ఉన్న అమ్మాయితో మాట్లాడాలన్నా కష్టమే .

 Never Stop Texting Your Crush … Want To Know Why ?-TeluguStop.com

మరి ఇప్పుడో … కుదిరితే ఇంట్లో కూర్చొనే అమెరికా అమ్మాయికి లైన్ వేయొచ్చు .ఆన్ లైన్ లో అయినా , ఆఫ్ లైన్ లో అయినా , ఒక్కటి మాత్రం కామన్ .అమ్మాయిలు సాధారణంగా ముందు మెసేజ్ చేయరు .అబ్బాయిలే చేయాలి.అబ్బాయి మొదలుపెడితేనే ముచ్చట్లు మొదలుపెడుతుంది అమ్మాయి .అదంతే , సిగ్గు ఎక్కువ అనుకోండి, లేదా ఆడజాతికి ఉండే సహజసిద్ధమైన అలవాటు అనుకోండి .

సరే, అబ్బాయే ముచ్చట్లు కలుపుతాడు , కొన్నిరోజులు చాటింగ్ లో గడిచిపోతాయి.రోజూ గంటలకొద్ది ముచ్చట్లు నడుస్తున్నాయి .ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది .ఇంతలో ఓ స్నేహితుడు వచ్చి సలహా ఇస్తాడు … కొన్నిరోజులు మెసేజ్, కాల్ చేయడం మానేస్తే, అమ్మాయి మనగురించి ఆలోచిస్తుందో లేదో తెలిసిపోతుందని .కాని అది చాలా చెత్త ఐడియా అని అమ్మాయిలే అంటున్నారు .

అబ్బాయేమో నన్ను మిస్ అవ్వాలి, నిజం చెప్పెయ్యాలి అనుకుంటాడు .కాని అబ్బాయి మేసేజ్ చేయడం మానేస్తే, తనకి నా మీద ఇంటరెస్ట్ తగ్గిపోయిందేమో అని అమ్మాయిలు అనుకుంటారట .అయితే ప్రతీ అమ్మాయి అలానే అనుకుంటుంది అని కాదు .కాని అలా అనుకునే ప్రమాదమైతే ఉంది .కాబట్టి ఇంకాస్త తెలివిగా ప్రయత్నించండి అబ్బాయిలు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube