ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోని అస్సలు నిద్రపోవద్దు

నిద్రలోకి జారుకోవాలంటే, ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.కొందరికి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంటుంది.

 Never Keep Your Ear Phones On During Sleep-TeluguStop.com

పుస్తకం చదువుతూ, చదువుతూ, అలాగే నిద్రపోవడం అలవాటైపోతుంది.మరికొందరికి నిద్రపోయే ముందు స్నానం చేయడం అలవాటు.

శరీరం చల్లచల్లగా ఉండగానే, నిద్రలోకి వెళిపోతూ ఉంటారు.ఇంకొందరికి సంగీతం వింటూ నిద్రపోవడం అలవాటు.

ఇప్పుడు సంగీతం వినడం అంటే ఇయర్ ఫోన్స్ వాడక తప్పట్లేదు.ఎదుటువారిని ఇబ్బందిపెట్టకుండా వినాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోక తప్పదుగా.

కాని చాలామంది పాటలు మోగుతుండగానే నిద్రపోయి, ఇయర్ ఫోన్స్ చెవులకు అలానే ఉంచేస్తారు.ఇది చాలా తప్పు.

నిద్రపోవడం అంటే మెదడుకి విశ్రాంతిని ఇవ్వడం.మీరు ఇయర్ ఫోన్స్ అలానే పెట్టేసి నిద్రపోయారంటే, మీ మెదడు తీసుకోవాలనుకునే పూర్తిస్థాయి విశ్రాంతిని చెడగొట్టినట్టే.

దీని వల్ల మొదడుపై ఒత్రిడి బాగా పెరుగుతుంది.అలసట, నిద్రలేమి, స్ట్రెస్ లాంటివి ఈ అలవాటు వలన త్వరగా వచ్చేస్తాయి.

కాబట్టి ఇక నిద్రపట్టేస్తుంది అని అనిపించినప్పుడు, ఇయర్ ఫోన్స్ తో పాటు మీ మొబైల్ ని కూడా దూరంగా పెట్టయ్యండి.అలా చేయకపోతే, మీ వినికిడి శక్తికి, మీ మెదడుకి, రెండింటికి ప్రమాదం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube