ఆ ఒక్క రాష్ట్రంపై ట్రంప్ గురి..అంత స్పెషల్ ఎందుకంటే..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రానున్న ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాడు.ఈ మేరకు తన ప్రచార బృందంతో కలిసి గతంలో తమకి అతి తక్కువ మెజారిటీ వచ్చిన స్థానాలపై దృష్టి పెట్టారు.

 President Donald Trump Concentrates Nevada State, Nevada State, President Donald-TeluguStop.com

ఆయా స్థానాలలో గెలుపుకోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ట్రంప్ విలువైన సమాచారాన్ని సేకరించాడని తెలుస్తోంది.అయితే ట్రంప్ దృష్టి పెట్టిన ఆయా రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీకి గతం నుంచీ కంచుకోటలుగా ఉండటంతో ఇప్పుడు ట్రంప్ ఏ రకంగా వాటిని ప్రభావితం చేస్తారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఈ క్రమంలోనే

ట్రంప్ పశ్చిమ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.ముఖ్యంగా నెవాడా, ఆరిజోనా , కాలిఫోర్నియా, వంటి రాష్ట్రాలను టార్గెట్ చేసిన ట్రంప్ గత ఎన్నికల్లో అక్కడి నుంచీ ఆశించిన ఫలితాలు రాలేదని, కానీ ఈసారి ఆయా రాష్ట్రాల నుంచీ మెజారిటీ రావాలని తన బృందానికి తేల్చి చెప్పారు.

ముఖ్యంగా నెవాడా రాష్ట్రం 2004 నుంచీ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా లేదు, గడించిన ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రం డెమోక్రటిక్ పార్టీకే మద్దతు ఇచ్చింది అందుకే.

అధ్యక్షుడు ట్రంప్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక్కడ ప్రచారానికి ఇప్పటికే 45 లక్షల డాలర్లు ఖర్చు చేసిన ట్రంప్ మరో 55 లక్షల డాలర్లు ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చారు.ఇక బిడెన్ కూడా ఇప్పటి వరకూ ఈ రాష్ట్రంలో 45 లక్షల డాలర్లు ఖర్చు చేయగా మరో 25 లక్షల డాలర్లు ఖర్చు చేయడానికి సిద్దమయ్యారు.

అత్యధిక జనాభా, అలాగే అభ్యర్ధుల గెలుపులో కీలక పాత్ర పోషించే రాష్ట్రం కావడంతో అందరూ ఇరు అధ్యక్ష అభ్యర్ధులు ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టారని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube