ఆ ఓట్లే...ఏపీలో సీఎం ని డిసైడ్ చేసేది..!

ఏపీలో లో ముక్కోణపు పోరు జరగనున్న నేపథ్యంలో ఏపార్టీ గెలుపు తీరాలకు చేరుకుంటుందో అనే టెన్షన్ వాతావరణం అందరిలో నెలకొంది.ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి.

 Neutral Votes Decided Ap Cm-TeluguStop.com

టీడీపీ, వైసీపీ , జనసేన పార్టీలలో ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుంది అనే విషయాన్ని రాజకీయ పండితులు సైతం చెప్పలేక పోవటం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.

రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది.?? అధికారం దిశగా పార్టీల తీసుకువెళ్ళే పరిస్థితులు ఏవి.?? అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఏ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎవరు ఎన్ని రకాలుగా రాజకీయాలు చేసిన చివరికి అధికారాన్ని డిసైడ్ చేసేది తటస్థ ఓటర్లు మాత్రమే అనేది విశ్లేషకుల అభిప్రాయం.అంతేకాదు తటస్థ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే అధికారాన్ని చేజిక్కించుకుంటుందని సర్వేలు సైతం చెప్పటం గమనార్హం.

ప్రతి పార్టీకి తమకంటూ నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది ఆ పార్టీ సామాజికవర్గం అండదండలు కూడా మెండుగానే ఉంటాయి.కానీ ఆయా పార్టీలు అధికారాన్ని చేపట్టాలి అంటే ఓటు వేయాల్సింది తటస్తులే.ఇప్పుడు వారి ఓట్లే కీలకం కావడంతో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనే ఆలోచనలో పడ్డారు పార్టీల అధినేతలు.

ఏ పార్టీతో ప్రమేయం లేకుండా వారికి నచ్చినట్టుగా ఓటు వేసే తటస్తులు ఎప్పటి నుంచో ఎన్నికల్లో కీలక ఓటర్లుగా ఉంటున్నారు.

మరి వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యుహాలు రచిస్తాయో, వారు ఎవరిని అధికారంలో నిలబెడుటారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube