విమానం నుంచి చేపల వర్షం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

అగ్రరాజ్యం అమెరికాలో ఏటా విమానం నుంచి చేప పిల్లలను కిందికి వదులుతున్నారు.అయితే ఇదేం పని అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 Netizens Wondering The Rain Of Fish From The Plane, Flight, Fishes,rain, Viral L-TeluguStop.com

ఇలా చేయడం వెనుక అనేక కారణాలున్నాయి.యుఎస్‌లోని నదులు, సరస్సులలో చేపల పునరుత్పత్తి కోసం అక్కడి ప్రభుత్వం అలా చేస్తోంది.

దీనికి చేప పిల్లలను రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లి, చేపలను వదల వచ్చు.అయితే అక్కడ ఎత్తైన కొండలు వల్ల సాధ్య పడడం లేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానాల నుంచి చేపలను జార విడుస్తున్నారు.వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని వన్యప్రాణి వనరుల ఉటా విభాగం ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

విమానంలో వేల సంఖ్యలో సజీవ చేపలు ఉన్నాయి.వీటిని దేశవ్యాప్తంగా ఉన్న 200 కంటే ఎక్కువ సరస్సులలో విడిచారు.

ఒక విమానంలో 35,000 చేపలను పట్టుకుని, వాటిని ఏదైనా సరస్సు లేదా నది వద్ద వదులుతున్నట్లు పేర్కొన్నారు.

ఆ ఫేస్‌బుక్ వీడియో చూడగానే చాలా మందికి సందేహాలు తలెత్త వచ్చు.

అంత ఎత్తు నుంచి చేప పిల్లలను విడుదల చేస్తున్నారు కాబట్టి వాటికి ఏమైనా హాని కలగొచ్చనే అనుమానం కలుగుతుంది.అయితే చేపలకు ఎటువంటి హాని కలగదని ‘ఉటా’ సంస్థ పేర్కొంది.

ఈ వారం వ్యవధిలో తాము దాదాపు 200 ఎత్తైన సరస్సులలో విమానాల ద్వారా చేపలను వదిలినట్ల ఆ సంస్థ పేర్కొంది.చేపలు కేవలం 1 నుంచి 3 అంగుళాల పొడవు మాత్రమే ఉన్నాయని, అవి నీటిలో పడినా ఏమీ కాదని తెలిపింది.

గతంలో ఎత్తైన ప్రాంతాలు కాబట్టి గుర్రాలపై చేపపిల్లలను తరలించి, సరస్సులలో వదిలేవారు.అది కొంచెం కష్టసాధ్యంగా ఉండేది.అయితే విమానాల ద్వారా చేపలను వదలడం కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే.అయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ చేపలను సరస్సులలో వదలడానికి అవకాశం ఉంటుంది.

అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube