చాలా మందికి పొద్దుటే లేచిన తర్వాత నుంచి, పడుకునే వారికి ఘుమఘుమలాడే వేడి వేడి చాయ్ తాగడం అంటే చాలా ఇష్టపడతారు.కొంత మంది రోజుకు ఎన్ని టీలు తాగమన్నా తాగుతారు.
ఇక టీలలో చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసు.ఇరానీ ఛాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడు అవుతుంది.
అయితే కొన్ని సార్లు వెరైటీగా కొందరు ప్రయత్నిస్తుంటారు.రుచి బాగుంటే ఓకే.అయితే ఒక్కోసారి కొన్ని వెరైటీలు చూస్తే వెగటు పుడుతుంది.అవి ఎలా తాగుతారురా బాబూ అంటూ కొందరు తల కొట్టుకుంటారు.
తాజాగా ఇలాంటి విషయం బాగా వైరల్ అవుతోంది.మీకు డ్రాగన్ ఫ్రూట్ తెలిసే ఉంటుంది.
అందులో పోషకాలు బాగా ఎక్కువ.అయితే ఆ డ్రాగన్ ఫ్రూట్తో ఓ వ్యక్తి ఛాయ్ అమ్ముతూ వైరల్ అయ్యాడు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ చాయ్ విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియో Instagram హ్యాండిల్ ది గ్రేట్ ఇండియన్ ఫుడీలో షేర్ చేయబడింది.ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ వీడియోలకు ట్యాగ్ చేయబడింది.
ఇప్పుడు ఈ వెరైటీ చాయ్ ఆన్లైన్లో బాగా వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక బాలుడు డ్రాగన్ ఫ్రూట్ పల్ప్తో కొంచెం పాలను వేసి టీని తయారు చేస్తున్నట్లు చూపిస్తుంది.
ఇది చూడగానే నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.టీని ఇలా కూడా తయారు చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
ఇదేం కాంబినేషన్ అంటూ వింతగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో టీ విక్రయించే వ్యక్తి వేడి వేడి టీని కప్పుల్లోకి పోయడం చూడవచ్చు.
తర్వాత అతను కొన్ని డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును తీస్తాడు.ఆ తర్వాత దానిని టీ కప్పులో కలుపుతాడు.
అతను దానిని ఒక చెంచా పాలతో పూర్తి చేస్తాడు.దీనిని చాలా మంది కస్టమర్లు లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు.
దీనిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే ‘పింక్ డ్రాగన్ ఫ్రూట్ వాలీ చాయ్! బంగ్లాదేశ్ నుండి యే ఆసక్తికరమైన రీల్ ఆప్కే లియే’ అని వీడియో క్యాప్షన్ పెట్టారు.దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తాము ఇలాంటి టీ తాగలేమని కామెంట్లు చేస్తున్నారు.