ఈమె లైఫ్ స్టైల్ చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్లు.. ఇలాంటి లైఫ్ కావాలంట‌..

Netizens Who Are Shocked By Tik Tok Star Ashu Preet Lifestyle

కొంత మంది రోజుల తరబడి కష్టపడినా కానీ వారి జీతం వారికున్న డబ్బు కేవలం కొన్ని క్షణాల్లో అయి పోతుంటుంది.కానీ కొంత మంది ఎటువంటి కష్టం చేయకపోయినా కానీ వారికి డబ్బు కోకొల్లలుగా ఉంటుంది.

 Netizens Who Are Shocked By Tik Tok Star Ashu Preet Lifestyle-TeluguStop.com

డబ్బే డబ్బు వద్దంటే డబ్బు అనే పాట కొందరికి కరెక్టుగా సూటవుతుంది.కొంత మంది వారసులు డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతుంటారు.

అటువంటి వరుసలోకే వస్తుంది టిక్ టాక్ స్టార్ అషూ ప్రీత్. ఈ అమ్ముడుకి ఉన్న డబ్బును చూస్తే ఎవరైనా సరే నోరెళ్ల బెట్టాల్సిందే.

 Netizens Who Are Shocked By Tik Tok Star Ashu Preet Lifestyle-ఈమె లైఫ్ స్టైల్ చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్లు.. ఇలాంటి లైఫ్ కావాలంట‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పట్టుమని పాతిక సంవత్సరాలు కూడా లేని ఈ అమ్మడు ఎంజాయ్ చేసిన విధానం చూసిన ప్రతి ఒక్కరూ అరే లక్కంటే ఆమెది.అలా ఉండాలి జీవితం అని అనుకుంటున్నారు.

అషూ ప్రీత్ తన వీడియోలను టిక్ టాక్ మరియు ఇన్ స్టా వంటి సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ ఉంటుంది.ఈ వీడియోలు చూసిన అనేక మంది అషూ లైఫ్ స్టైల్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

కొంత మంది కుళ్లుకుంటున్నారు.ఎవరి అభిప్రాయం వారిది కానీ అషూది మాత్రం రిచ్ లైఫ్ స్టైల్.

అషూ ఈ మధ్యే తన 21వ పుట్టిన రోజును జరుపుకుంది.ఈ బ్యూటీ పుట్టిన రోజును జరుపుకున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Telugu Ashu Preet, Lifestyle, Parenst, Rich Kid, Soical-Latest News - Telugu

ఇన్నాళ్లూ తమ ప్రైవేట్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడానికి చాలా మంది సందేహించేవారు కానీ ప్రస్తుతం మాత్రం చాలా మంది సెలబ్రెటీలు తమ పర్సనల్ లైఫ్ ముచ్చట్లను తమ ఫాలోవర్స్ తో నిస్సం కోచంగా పంచుకుంటున్నారు.ఇలా అషూ పోస్ట్ చేసే వీడియోలు ఫొటోలు చూస్తే ఎవరికైనా సరే మతి పోతుంది.కొంత మంది మాత్రం అషూ పేరెంట్స్ కష్టపడి సంపాధించిన సొమ్ముతో జల్సాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

#Soical #Rich Kid #Ashu Preet #Lifestyle #Ashu Preet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube