ఈ దొంగ తెలివితేటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మాత్రం తమ తెలివిని విపరీతంగా వాడేస్తూ డబ్బులను, విలువైన వస్తువులను దోచేస్తున్నారు.ఈ దొంగలు దొంగతనాలు చేయడానికి ఎటువంటి ట్రిక్స్ చేస్తున్నారో తెలియజేయడానికి సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవేర్నెస్ వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.

 Netizens Who Are Falling Prey To This Thief Intelligence, Theif, Car, Back Door,-TeluguStop.com

ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా దొంగల చేతిలో మోసపోవడం ఖాయం.ఇటీవల ఓ కేటుగాడు చేసిన దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది.

కేటుగాడి దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి.

ఈ వీడియోలో డ్రైవర్ పార్కింగ్ ప్లేస్ లో తన కారు కు లాక్ వేయడం చూడొచ్చు.

అయితే డ్రైవర్ కారులోంచి దిగి లాక్ వేసే సమయానికి ఒక దొంగ వెనుక నుంచి వచ్చి కారు వెనక డోర్ ని తీసాడు.ఈ విషయం తెలియని కారు యజమాని ముందు డోర్ వేసి కార్ ని లాక్ చేసి వెళ్ళిపోయాడు.

కానీ తన కారు యొక్క వెనుక డోర్ ఆల్రెడీ తీసి ఉందనే విషయాన్ని గమనించ లేకపోయాడు.కార్ కి లాక్ పడిందని డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయని భావించిన ఆ యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Telugu Door, Netizens, Theif, Latest-Latest News - Telugu

అయితే యజమాని వెళ్లిపోయేంత వరకూ ఆ దొంగ వేచి చూశాడు.యజమాని చాలా దూరం వెళ్లి పోయిన తర్వాత ఆ దొంగ వెంటనే కారు యొక్క మరొక వెనుక డోర్ తీశాడు.ఆ తర్వాత మొదటిగా తాను తీసిన కారు డోర్ నుంచి లోపలికి ప్రవేశించాడు.కార్ లో ఉన్న బ్యాగ్, లాప్టాప్ తో పాటు విలువైన వస్తువులను దొంగలించి అనంతరం తాను రెండోసారి తీసిన వెనుక డోర్ నుంచి ఎంచక్కా పరారయ్యాడు.

అయితే ఈ దొంగ తెలివికి కొందరు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మరికొందరు మాత్రం తమ భయాన్ని వ్యక్తం చేస్తూ దొంగల బారి నుంచి సురక్షితంగా ఉండటానికి చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న దొంగతనం ఇండియాలోనే జరిగిందని తెలుస్తోంది.అయితే పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఈ దొంగతనం జరగడం గమనార్హం.

కొంచెం కూడా భయం లేకుండా ఈ దొంగ తన ట్రిక్ ని విజయవంతంగా ప్రయోగించడం విశేషం.ఏదిఏమైనా ఈ వీడియో ని సాధ్యమైనంత వరకు షేర్ చేసి అందర్నీ అప్రమత్తం చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube