బుల్లితెర పై అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్ లను పూర్తి చేసుకొంది .ఈ కార్యక్రమం ఐదు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తుందని నిర్వాహకులు చెప్పారు.అయితే ఈ సీజన్ వినోదాన్ని పంచడం ఏమో కానీ విమర్శలను మాత్రం ఎదుర్కొంది.ఈ విధంగా ఐదవ సీజన్ లో విన్నర్ గా సన్నీ, రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.
ఈ బిగ్ బాస్ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ 3 సీజన్ ప్రసారమయ్యే సమయంలో హౌస్ మేట్స్ వారి ప్రవర్తన కారణంగా ఈ షోను ఆపివేయాలని యాంకర్ శ్వేత అప్పట్లో అన్నారు.
అంతేకాకుండా ఈ షో మీద చాలా నెగిటివిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోయిందని ఈ కార్యక్రమం గురించి ఎన్నో విమర్శలు చోటు చేసుకున్నాయి.గత ఐదవ సీజన్ ల నుంచి బిగ్ బాస్ షో పై చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జున పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమం కేవలం గంట మాత్రమే కాకుండా 24 గంటలు ప్రసారమయ్యేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో, ప్రోమో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలో వెన్నెల కిషోర్ దొంగతనం చేసి జైలుకు వెళ్తారు.
ఈ దొంగతనం చేసిన అతనికి కోర్టు ఉరి శిక్ష విధిస్తుంది.ఇక ఉరిశిక్ష వేస్తే ముందు చివరి కోరిక ఏదైనా ఉందా అని అడగగా తనకు బిగ్ బాస్ చూడాలని కోరికగా ఉందని తెలిపారు.
అయితే ఈ కార్యక్రమం 24 గంటలు ప్రసారం కావడంతో ఇక ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు, జడ్జి, జైలు అధికారులు కూడా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండిపోతారు.ఇక ఈ ప్రోమోలో నాగార్జున లాయర్ గా కనిపించారు.ఇలా నాగార్జున నో పులి స్టాప్… నో కామా.నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈ ప్రోమో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ ప్రోమో పై నెటిజన్ స్పందిస్తూ బిగ్ బాస్ కార్యక్రమం గవర్నమెంటును దారుణంగా అవమానించారు.
ఈ ప్రోమో పై కేసు వేయాలి… జై కామెడీ బిగ్ బాస్ అంటూ కామెంట్ చేశారు.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తోంది.