హోం వర్క్ చేస్తున్న పిల్లాడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే..

విద్యార్థులు బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటుంటే ఎవరూ కూడా డిస్టబ్ చెయ్యరు.అంతేకాదు హోం వర్క్ శ్రద్ధగా పూర్తిచేసే పిల్లలను పొగుడుతారు.

 Netizens Uniting A Child Doing Homework If You Know Why-TeluguStop.com

కానీ ఒక పిల్లాడు విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది.ఎంతో శ్రద్ధతో తన హోం-వర్కు పూర్తి చేస్తున్న ఓ బాలుడిని నెటిజన్లు తెగ ఏకిపారేస్తున్నారు.

ఇదేం పనికిమాలిన అలవాటు అంటూ తెగ తిట్టిపోస్తున్నారు.అంతేకాదు విద్యార్థి తల్లిని కూడా వదలడం లేదు.

 Netizens Uniting A Child Doing Homework If You Know Why-హోం వర్క్ చేస్తున్న పిల్లాడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హోంవర్క్ చేయడంలో తప్పేముంది అంటారా? నిజానికి ఇందులో ఎలాంటి తప్పు లేదు.కానీ హోం వర్క్ ఎప్పుడు ఎక్కడ చేయాలో.

అక్కడే పూర్తి చేయాలి.ఒక విద్యార్థి మాత్రం వేగంగా వెళుతున్న ఓ స్కూటీ పై కూర్చొని తన స్కూల్ వర్క్ చేశాడు.

స్కూటీ వెనక సీటు అంచున కూర్చొని.మధ్యలో నోట్ బుక్ ఉంచి హోం వర్క్ పూర్తి చేశాడు.

ఇలాంటి పనులే ప్రాణాల మీదకు తెస్తాయి.వేగంగా నడుస్తున్న స్కూటీ పైనుంచి కొంచెం పట్టుతప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

అయితే అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఈ డేంజరస్ స్టంట్ ని వీడియో తీశారు.తరువాత నెట్టింట షేర్ చేశారు.

కాగా ప్రస్తుతం ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

టీచర్ కొడుతుందేమోననే భయంతో విద్యార్థి స్కూటీపై కూర్చుని హోం వర్క్ చేశాడనుకుందాం.కానీ తల్లికైనా సోయి ఉండక్కర్లే? అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ప్రమాదకర స్థాయిలో హోం వర్క్ చేస్తే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని మరికొందరు హితబోధ చేస్తున్నారు.

ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైమ్ వేస్ట్ చేసి.ఇప్పుడు ఇలా హోం వర్క్ పూర్తి చేయడం తప్పు పట్టాల్సిన విషయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

బుడ్డోడిని ఎంకరేజ్ చేస్తున్న తల్లిని సైతం విమర్శిస్తున్నారు.ఈ వీడియో పై మీరు ఒక లుక్కేయండి.

#Viral Video #Home Work #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు