నల్లగా ఉన్నావంటూ షారుక్ ఖాన్ కూతురుపై ట్రోల్స్.. ఆమె సమాధానం?

అందం మనసుకు సంబంధించినది.తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా.

 Sharukh Khan Daughter Suhana Khan Fitting Reply To Netizens, Netizens Trolls On-TeluguStop.com

ముక్కు సక్కగా ఉన్నా ఎలా ఉన్నా మనిషి మనసు ముఖ్యం.మనిషిలోని టాలెంట్ ముఖ్యం.

నిజమే మనిషి అందంగా ఉంటే మంచి మార్కులు పడుతాయ్.కాదు అని చెప్పం కానీ అందమే అయితే ముఖ్యం కాదు.

ఇకపోతే సినీ సెలబ్రెటీలకు అందం ముఖ్యం.వారి పిల్లలు అందంగా, నటన పరంగా టాలెంట్ ఉంటే సినిమాల్లోకి వస్తారు లేదా వేరే కెరియర్ చూసుకుంటారు.

ఇక అలానే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ కూడా బాగుంటుంది.కానీ కాస్త రంగు తక్కువ.దీంతో ఆమెను కొందరు దారుణంగా మాట్లాడారు.సుహానా ఖాన్‌ ను చూస్తే వాంతు వస్తుందని కొందరు కామెంట్లు పెట్టారు.

ఇక ఆమె 12 ఏళ్ల వయసు నుంచే రంగు వల్ల వివక్ష ఎదర్కొంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె బాధ వెల్లడించింది.రంగు గురించి మాట్లాడిన ప్రతిఒక్కరికి గట్టిగ షాక్ ఇచ్చింది.

కొంతమంది ఆమెను దారుణంగా దూషించారని, రంగు గురించి మాట్లాడి బాధపెట్టారు అని స్క్రీన్ షాట్స్ తీసి సుహానా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఆమె నల్లని మంత్రగత్తె అని, నల్లగా ఉండి అసలు చూడాలని కూడా అనిపించడం లేదంటూ కామెంట్ చేశాడు ఓ వ్యక్తి.

షారుక్ ఖాన్ కూతురు ఓ నల్ల కాకిపిల్ల అంటూ పోస్ట్ చేసిన వాటిని కూడా ఆమె షేర్ చేశారు.అయితే ఇది షేర్ చేస్తూ.ఈ కామెంట్స్ పెట్టినవారంతా బాగా చదువుకున్నవాళ్లే.చిన్నపిల్లలు కాదు.

ఇండియన్స్ అంతా ఒకటే కదు మళ్లీ రంగు గురించి ఎందుకు అంటూ ఆమె కామెంట్ చేసింది.నల్లగా కనిపిస్తే అందంగా లేనట్టా అంటూ ఆమె ప్రశ్నించింది.

దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube