మీ ముఖాన్ని దాచుకునే పనులు చెయ్యకండి.. రాజ్ కుంద్రాపై షాకింగ్ ట్రోల్స్?

Netizens Trolls Raj Kundra Hiding His Face

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.2 నెలల క్రితం వీరి పేర్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే.రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ విషయంలో అరెస్ట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఆ సమయంలో ఈ జంట అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.ప్రస్తుతం ఈ సమస్యలన్నీ కొంచెం సర్దుమనిగిన్నట్లు కనిపిస్తున్నాయి.

 Netizens Trolls Raj Kundra Hiding His Face-TeluguStop.com

రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇద్దరూ కలిసి ఆలయాలను సందర్శించడం, టూర్ కి వెళ్లడం,కొంత సమయాన్ని గడపడం లాంటివి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను నెటిజన్స్ మరొకసారి ట్రోలింగ్ చేశారు.తాజాగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబై విమానాశ్రయం నుంచి వేరే ప్రదేశానికి బయలుదేరారు.

 Netizens Trolls Raj Kundra Hiding His Face-మీ ముఖాన్ని దాచుకునే పనులు చెయ్యకండి.. రాజ్ కుంద్రాపై షాకింగ్ ట్రోల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే వారిద్దరూ వెళ్తున్న వీడియోని ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.అది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా వేర్వేరుగా తమ కార్లలో నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు.కారు దిగిన వెంటనే రాజ్ కుంద్రా కెమెరాలకు కనిపించకుండా హడావిడిగా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళాడు.

ఈ క్రమంలోనే తన ముఖం పూర్తిగా కనబడకుండా బ్లాక్ హుడి ధరించాడు రాజ్ కుంద్రా.ఈ విషయం పై ఒక రాజ్ కుంద్రా తన ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్నందుకు మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా,మరొక నెటిజెన్ మీరు కూడా చూడకూడని పనులు చేయకండి అని కామెంట్ చేశారు.మరొక నెటిజన్ అప్పుడే సిగ్గులేని వాళ్ళ మొహం దాచుకోవడం చూసి నవ్వుతారు అని కామెంట్ చేశారు.ఇలా నెటిజన్లు రాజ్ కుంద్రాను దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

#Shilpa Shetty #Raj Kundra #Pornography #Bhayani #Mumbai Airport

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube