బోయపాటిని ఏకి పారేస్తున్న నెటిజన్స్‌... బాబోయ్‌ ఏంటయ్యా ఆ సీన్స్‌?     2019-01-12   11:13:57  IST  Ramesh Palla

యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పీక్స్‌లో ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన మాస్‌ ఎలిమెంట్స్‌తో సినిమాలు ఉంటాయి. ప్రతీ సీన్‌లో కూడా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే లక్షణాలు ఉంటాయి. అలాంటి బోయపాటి శ్రీను తాజాగా వినయ విధేయ రామ చిత్రాన్ని తెరకెక్కించాడు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కైరా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Netizens Trolls On VVR Director Boyapati Sreenu-Director Sreenu Hero Prasanth Ram Charan Srinu Vinaya Vidheya Rama Review Movie

Netizens Trolls On VVR Director Boyapati Sreenu

ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుందని చాలా నమ్మకంగా ప్రేక్షకులు ఎదురు చూశారు. తీరా చూస్తే సినిమా బాబోయ్‌ అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా బోయపాటి పెట్టిన కొన్ని ఫైట్‌ సీన్స్‌ రచ్చ రచ్చగా ఉన్నాయి. రామ్‌ చరణ్‌ తలకాయలను నరికితే ఆ తలకాయలు ఎగురుకుంటూ పైకి వెళ్లడం, ఆ తలకాయలను గద్దలు ఏసుకు వెళ్లడం మరీ ఓవర్‌ అయ్యింది. ఇక పాముతో విలన్‌ కరిపించుకోవడం, ఆ పాము చనిపోవడం ఇక పీక్స్‌కు చేరింది.

Netizens Trolls On VVR Director Boyapati Sreenu-Director Sreenu Hero Prasanth Ram Charan Srinu Vinaya Vidheya Rama Review Movie

ఈ రెండు సీన్స్‌పై నెటిజన్స్‌ రచ్చ చేస్తున్నారు. బోయపాటిని టార్గెట్‌ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా రచ్చ రచ్చగా కామెంట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తలలు గాల్లో ఎగరడం ఏంటీ, వాటిని గద్దలు పట్టుకు పోవడం ఏంట్రా బాబోయ్‌ అంటున్నారు. ఇక పాము కరిస్తే ఆ పాము చనిపోవడం ఏంటి బోయపాటి, విలన్‌ ఎంత పవర్‌ ఫుల్‌ అయినా మనిషే కదా, అలా చూపించావేంటోయ్‌ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్‌ పడుతున్నాయి. బోయపాటిని నమ్మినందుకు చరణ్‌ తన చేత్తో తానే కొట్టుకోవాలని మెగా ఫ్యాన్స్‌ కూడా వాపోతున్నారు. అవతల నందమూరి ఫ్యాన్స్‌ మాత్రం డీజే సాంగ్స్‌ పెట్టుకుని డాన్స్‌లు వేస్తున్నారు.