మరో అమ్మాయితో షన్ను రొమాన్స్.. ఎవరితో పడితే వాళ్లతో ఇదే పనంటూ ట్రోల్స్?

సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈయన పరిచయం అందరికీ తెలిసిందే.

 Netizens Trolls On Shanmukh Jaswanth Dance Video With Another Girl Details, Neti-TeluguStop.com

మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ మొత్తానికి ఓ సెలబ్రెటీ హోదాను అందుకున్నాడు.యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పరిచయం పెంచుకున్నాడు.ఇక ఈయన బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఏకంగా తన మంచి జీవితానికి చెదిరిపోని మచ్చని ముద్రించుకున్నాడు.

పైగా తన అభిమానులు కూడా  విమర్శించేలా చేసుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్ సిరి తో బాగా రెచ్చిపోయాడు.

అప్పటికే ఆయనకు మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన తో ప్రేమలో ఉన్నాడు.వీరిద్దరూ పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.బుల్లితెరపై ప్రసారమైన పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.నిజానికి ఈ జంటని చూస్తే చాలు లవ్ చేసుకునే కపుల్స్ ఇంత క్యూట్ గా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వినిపించాయి.కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి తో చేసిన రాద్ధాంతం వల్ల.

పూర్తిగా అతడికి దూరంగా ఉంది.నిజానికి వీరి బ్రేకప్ ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఇక ఇదంతా పక్కన పెడితే.ఇప్పుడు ఎవరి దారి వారు అన్నట్లు బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటారు.ఇక షణ్ముఖ్ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ తో కూడా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఓవైపు కవర్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన ఓ వెబ్ సిరీస్ చేయగా అది త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు తను డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటూ ఉంటాడు.అయితే దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత ఈయనకు బాగా ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ వెంటాడుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈయన ట్రోలింగ్స్ కు గురయ్యాడు.తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకున్నాడు.

అందులో తన పక్కన మరో అమ్మాయి ఉండగా.ఈయనకు బాగా ట్రోల్స్ వస్తున్నాయి.

నీ పని బెస్ట్ రా.ఎవరు బాగుంటే వాళ్ళతో సాంగ్ అని ఫ్రెండ్షిప్ అని భలే రొమాన్స్ చేస్తూ గడిపేస్తున్నావు అంటూ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube