లోకేష్ పరువు పాయే..!!!

ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.ఆ పార్టీ నేత ఈ పార్టీ నేతలని, వీళ్ళు వాళ్ళని బండ బూతులు తిట్టుకునే సమయం వచ్చేసింది.

 Netizens Trolls On Lokesh About Ktr With Ys Jagan-TeluguStop.com

కీలక సమయాలలో సైతం పార్టీకి అండగా ఉండాల్సిన వారు సైతం పార్టీకి వెన్ను పోట్లు పొడిచి బురద జల్లి బయటకి వచ్చే కాలం కూడా ఇదే.అయితే ఈ క్రమంలోనే ఆయా పార్టీలు, నేతలు ఎంతో హుందాగా , అత్యంత జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది.ఇక నేతల మాటేమో కాని నాయకులు మాత్రం తప్పకుండా తాము మాట్లాడే ప్రతీ మాటని ఆచి తూచి మాట్లాడాలి లేదంటే పార్టీల పరువులు గంగ పాలే.అయితే

గతంలో లా ఇప్పుడు ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు, ఎవరైనా ఎంత ఒక విమర్శ చేసినా లేదా సోషల్ మీడియాలో ట్వీట్ లు చేసినా వాటికి దిమ్మతిరిగిపోయేలా తిరిగి కౌంటర్ లు ఇస్తున్నారు.దాంతో సదరు పార్టీల ,నాయకుల పరువు పోగొట్టుకుంటున్నారు.అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే టీడీపీ కి భవిష్యత్తు సారధిగా వ్యవహరించాల్సిన లోకేష్ మాత్రం పప్పులో కాలు వేస్తూనే ఉన్నారు.

తాజాగా జరిగిన ఒక సంఘటన విషయంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.దాంతో జనాలు కూడా రీ ట్వీట్ లతో ఎకేస్తున్నారు.మరి లోకేష్ బాబు చేసిన ట్వీట్ కి బదులుగా ప్రజలు ఇచ్చిన రీ -ట్వీట్ లు ఎలాంటి షాకులు ఇచ్చాయంటే.జగన్ , కేటిఆర్ తో ఎప్పుడైతే భేటీ అయ్యాడో అప్పటి నుంచీ టీడీపీ నేతలు వరుసగా జగన్ ని టార్గెట్ చేస్తూ మీడియాలో ఏకడం మొదలు పెట్టారు.

ఇది చూసిన లోకేష్ తానూ కామెంట్స్ చేయకపోతే ఎలా అనుకున్నారో ఏమో కాని ఇది ఎంతో దారుణం అంటూ కేసీఆర్ ఆంధ్రా వారిపై చేసిన కామెంట్స్ ని తట్టిలేపి జగన్ ఇలాంటి వారితో కలవదమా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.అయితే

గతం మర్చిపోయిన లోకేష్ కేసీఆర్, జగన్ ని కలిపి చేసిన ట్వీట్ కి నెటిజన్లు , ఇచ్చిన రీ ట్వీట్ లతో దెబ్బకి గతం గుర్తు చేశారు.

లోకేష్ గతాన్ని మర్చి పోకూడదు.చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్ తో తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి వచ్చి అడిగినప్పుడు నీకు గుర్తుకు రాలేదా రాక్షసులు డైలాగులు.

మీరు చేస్తే రైట్ ,జగన్ చేస్తే తప్పా అంటూ తెలంగాణా ప్రజలు ఊకదంపుడుగా కామెంట్స్ చేశారు.“ ఈ క్రమంలో సింహం సింగిల్‌గా వస్తుంది.అంటూ టీడీపీ కి అనుకూలంగా కామెంట్స్ చేస్తే అవును మరి తెలంగాణా ఎన్నికల్లో పందులు పందులుగా పొత్తు పెట్టుకుంది ఎవరో తెలుసులే అంటూ కామెంట్స్ చేశారు.

ఇలా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసేశారు.దాంతో అసలు లోకేష్ కి సరైన పరిజ్ఞానం లేకుండా ఇలాంటి ట్వీట్ లు పెట్టి ఎందుకు టీడీపీ పరువుని రోడ్డుకి ఈడ్చుతున్నారు అంటూ టీడీపీ సీనియర్స్ తలలు పట్టుకుంటున్నారు.అయినా లోకేష్ కి ఇదేమి కొత్తకాదుగా అంటూ తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారట.

భవిష్యత్తులో టీడీపీ భాద్యతని భుజాలపై మోయాల్సిన లోకేష్ ఈ రకంగా ప్రవర్తించడం ఎన్నికల సమయంలో ఒకింత ఇబ్బందే అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube