కళ తప్పిన బిగ్ బాస్.. హిట్ కావడం కష్టమే?

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఉండే క్రేజే వేరు.తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ 1 సూపర్ హిట్ కాగా నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ 2 అబవ్ యావరేజ్ గా నిలిచింది.

 Netizens Trolls On Bigg Boss Season 4 Contestants, Bigg Boss4 Contestants, Youtu-TeluguStop.com

నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 హిట్ అనిపించుకుంది.నిన్న బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే “కళ తప్పిన బిగ్ బాస్” అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొదటి నుంచి బిగ్ బాస్ షోలో వీళ్లే పాల్గొనబోతున్నారంటూ కొన్ని పేర్లు ప్రచారంలోకి రాగా ఎవరూ ఊహించని కొంతమంది వ్యక్తులు షోలో పాల్గొనడం గమనార్హం.హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ల విషయంలో నెటిజన్లు తీవ్రస్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దగా పరిచయం లేని వాళ్లే ఈసారి బిగ్ బాస్ షోలో పాల్గొన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.పెద్దగా ఫేం లేని వారే షోలో పాల్గొన్నారని… షోలో పెద్దగా గ్లామర్ లేదని నెటిజన్లు చెబుతున్నారు.

యూట్యూబ్ స్టార్స్ కు, సీరియల్ స్టార్స్ కే పెద్దగా ప్రాధాన్యత ఇచ్చారని… గత సీజన్లలా పెద్దగా తెలిసిన మొహాలు లేవని తెలుపుతున్నారు.సూర్యకిరణ్, అభిజిత్, అమ్మ రాజశేఖర్, సొహైల్, దివి, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్ వల్ల షోకు ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు.

వీరిలో కొంతమంది గురించి గూగుల్ లో వెతికినా దొరకడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

కళ తప్పిన బిగ్ బాస్ షో గత సీజన్లలా హిట్ కావడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube