నాగార్జునను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 హిట్ కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 4కు కూడా ఆయననే హోస్ట్ గా ఎంపిక చేసుకున్నారు.

 Netizens Trolls On Nagarjuna Photos With Divi And Noel Sean, Noel Sean, Divi, So-TeluguStop.com

అయితే హోస్ట్ నాగార్జున కొన్ని విషయాల్లో సమన్యాయం చేయడం లేదని, కంటెస్టెంట్ల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నోయల్ చెప్పాడనే కారణంతో ఈ వారం బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.

నోయల్ చెప్పాడని నిబంధనలు మార్చడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అమ్మ రాజశేఖర్, అవినాష్ లను ఒంటికాలిపై నిలబడమని చెప్పిన సమయంలో నాగార్జున సైలెంట్ గా ఉండటం ఏమిటని ఫైర్ అవుతున్నారు.

అలా కంటెస్టెంట్లకు ఇతర కంటెస్టెంట్లపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత వచ్చే విధంగా నాగ్ అవకాశం ఇవ్వడం సరికాదని చెబుతున్నారు.

Telugu Bigg Boss, Divi, Netizens, Netizenstrolls, Noel, Noel Sean, Distance-Late

అనధికారికంగా జరుగుతున్న సర్వేలలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడని వార్తలు రాగా నాగార్జున మాత్రం అమ్మ రాజశేఖర్ కు ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయని అందువల్ల ఆయనను వచ్చే వారం కెప్టెన్సీకి నేరుగా పోటీ చేయవచ్చని అన్నారు.దీంతో గత సీజన్లలా ఈ సీజన్ లో ప్రేక్షకుల అభిప్రాయాలకు విలువనివ్వడం లేదని బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.నాగార్జున సైతం ఎలిమినేషన్ విషయంలో కొంతమంది కంటెస్టెంట్లకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు.

మరోవైపు బిగ్ బాస్ స్టేజ్ పై నోయల్ తో సోషల్ డిస్టెన్స్ అంటూ నాగార్జున దూరంగా జరిగారు.తాను ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చానని అన్నాడు.

కానీ నాగార్జున ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దివితో మాత్రం సన్నిహితంగా ఫోటో దిగాడు.దీంతో మగాళ్లకేనా సోషల్ డిస్టెన్స్.? అంటూ కొందరు నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube