కత్తి కార్తీకను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

సాధారణంగా సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లు ఏదైనా విషయం గురించి మాట్లాడే సమయంలో పూర్తి అవగాహనతో మాట్లాడాలి.లేకపోతే ట్రోలింగ్ ను ఎదుర్కోక తప్పదు.

 Netizens Trolls Dubbaka By Election Contestant Kathi Kartheeka,bigg Boss Contest-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్1 కంటెస్టెంట్, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి కార్తీకను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.విషయపరిజ్ఞానం లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల నెటిజన్లు కత్తి కార్తీకకు ఈ విషయం కూడా తెలియదా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే దుబ్బాక నియోజకవర్గ ఫలితాల్లో కత్తి కార్తీకకు కేవలం 319 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కత్తి కార్తీకకు వచ్చిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు దాదాపు ఒకటే కావడం గమనార్హం.దుబ్బాక ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన కత్తి కార్తీక ఎన్నికల ఫలితాల అనంతరం సైలెంట్ అయ్యారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తీక దుబ్బాకలో తన పరాజయానికి కారణాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఫైటర్ ను అని ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఫైట్ చేయడం ఆపనని కార్తీక అన్నారు.

ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టడంలో వెయ్యిసార్లు ఫెయిల్ అయ్యాడని ఫెయిల్ అయ్యానని మళ్లీ ప్రయత్నించకపోతే ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టేవాడా.? అని చెప్పారు.థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టగా కత్తి కార్తీక ఎడిసన్ కు బదులుగా ఐన్ స్టీన్ పేరు చెప్పడంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

లండన్ లో అర్కిటెక్ చదివిన కార్తీకకు బల్బును ఎవరు కనిపెట్టారో కూడా తెలియదా.? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.ఇంటర్వ్యూల్లో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలని లేకపోతే ట్రోలింగ్ ను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

గతంలో ఎమ్మెల్యే ఒకరు బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందంటూ నవ్వుల పాలైన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube