ప‌డుకునే స‌మయంలోనూ ఓవ‌ర్ మేక‌ప్ తో నటి.. నెటిజన్స్ ఏం అన్నారంటే?

Netizens Trolls Actress Lakshmi Menon For Over Make Up While Sleeping Lakshmi Menon, Sleeping, Over Make Up, Netizens Trolls, Gajaraju Movie

సినీ పరిశ్రమలో నటించే నటీనటులకు తమ పాత్రలు ఎంత ముఖ్యమో.తాము ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ అందం కూడా అంతే ముఖ్యం.

 Netizens Trolls Actress Lakshmi Menon For Over Make Up While Sleeping Lakshmi Me-TeluguStop.com

ఇక నటీనటులు సినిమా పూర్తయ్యేంతవరకు తమ అందమును కాపాడుకుంటూ తరచుగా మేకప్ ను వేసుకుంటుంటారు.అలా అలవాటు పడిన వాళ్ళు ఏదైనా సమయంలో బయటకు వెళ్ళినప్పుడు కూడా మేకప్ వేస్తుంటారు.

ఇలా ఎంతో మంది హీరోయిన్స్ కూడా తమ ఇంట్లో ఉన్నంత సేపు మేకప్ దిద్దుకుంటూ ఫోటోలను షేర్ చేస్తుంటారు.ఇదిలా ఉంటే ఓ నటి తాను పడుకునే సమయంలో కూడా ఓవర్ మేకప్ తో వైరల్ గా మారింది.

తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి లక్ష్మీ మీనన్ఈమె ఎక్కువగా తమిళం లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అంతే కాకుండా తెలుగులో గజరాజు సినిమాలో కూడా నటించింది.ఇదిలా ఉంటే ఈమె సోషల్ మీడియాలో కూడా తన ఫోటోల షేర్ల తో తెగ బిజీగా ఉంటుంది.ఇక ఆమె ఐదేళ్లపాటు తన సినీ జీవితానికి బ్రేక్ ఇవ్వగా తన చదువు పై దృష్టి పెట్టింది.

ఇక ఇటీవలే మళ్లీ సినీ ప్రవేశం చేయగా పులికుట్టి పండి అనే తమిళ సినిమాల్లో నటించి మళ్లీ అభిమానులకు దగ్గరయ్యింది.ఈ సినిమా ఓ టి టీ లో విడుదల కాగా మంచి విజయం అందుకుంది.ఇదిలా ఉంటే ఆమె తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.అందులో ఆమె పడుకునే ముందు ఓవర్ మేకప్ తో కనిపించగా నెటిజనులు ఆమెను ట్రోల్ చేశారు.

కొంతమంది నెటిజనులు నిద్రపోయే ముందు మేకప్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube