ఈ హీరోయిన్ ను ఎవరికైనా చూపించండ్రా.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

టీవీ నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం హీరోయిన్లలో ఉర్ఫీ జావేద్ ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి హింది బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత పాపులర్ అయ్యారు.

 Netizens Trolling Urfi Javed Details, Urfi Javed, Urfi Javed Trolled, Urfi Javed-TeluguStop.com

ఉర్ఫీ జావేద్ కు హిందీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బిగ్ బాస్ షో ద్వారా ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా ఫాలోవర్లు ఊహించని స్థాయిలో పెరిగారనే సంగతి తెలిసిందే.

ఇతరులతో పోలిస్తే డ్రెస్సింగ్ స్టైల్ విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే ఉర్ఫీ జావేద్ కొన్నిసార్లు తన డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా విమర్శలు మూటగట్టుకున్నారు.బోల్డ్ గా మాట్లాడే ఉర్ఫీ జావేద్ కు సపోర్ట్ చేసేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను విమర్శించే వాళ్లు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉర్ఫీ జావేద్ ను రిపోర్టర్ ముంబైలో వర్షాల గురించి ప్రశ్నించారు.

రిపోర్టర్ వర్షాకాలం అంటే ఇష్టమా అని అడగగా నాకు స్నానం చేయడం నచ్చదని వర్షాకాలం వస్తే స్నానానికి దూరంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.నేను చాలా లేజీ అని ప్రతిరోజూ నేను బద్ధకంగానే ఉంటానని ఆమె కామెంట్లు చేశారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈమెను ఎవరికైనా చూపించండి అంటూ చెప్పుకొచ్చారు.

అలియా భట్ ప్రెగ్నెన్సీ గురించి, ఇతర విషయాల గురించి ఉర్ఫీ జావెద్ గతంలో బోల్డ్ గా మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయి.ఉదయ్ పూర్ టైలర్ హత్య గురించి ఉర్ఫీ చేసిన కామెంట్లు నచ్చకపోవడంతో ఒక వ్యక్తి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు దిగారు.ఉర్ఫీ జావేద్ గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube