బన్నీ లుక్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. పుష్పరాజ్ బాలేడంటూ?

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.ఏపీలోని పలు ఏరియాల్లో ఈ సినిమా నష్టాలను మిగిల్చినా ఇతర ఏరియాల్లో మాత్రం ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

 Netizens Trolling Star Hero Allu Arjun Look Details, Allu Arjun Look, Allu Arjun, Allu Arjun Gain Weight, Pushpa, Pushpa The Rule, Pushpa The Rise, Allu Arjun Trolled, Pushpraj Look-TeluguStop.com

పుష్ప ది రూల్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే పుష్ప ది రూల్ కోసం బన్నీ బరువు పెరిగారని తెలుస్తోంది.

బన్నీ కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా కొత్త లుక్ లో బన్నీ ఆకట్టుకోవడం లేదని నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ కొత్త లుక్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 Netizens Trolling Star Hero Allu Arjun Look Details, Allu Arjun Look, Allu Arjun, Allu Arjun Gain Weight, Pushpa, Pushpa The Rule, Pushpa The Rise, Allu Arjun Trolled, Pushpraj Look-బన్నీ లుక్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. పుష్పరాజ్ బాలేడంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి కొందరు నెటిజన్లు బన్నీ లుక్ క్రికెటర్ మలింగాలా ఉందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అయితే పుష్ప 2 సినిమాలో బన్నీ నిజంగానే ఈ విధంగా కనిపిస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు పుష్ప2 బడ్జెట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.పుష్ప ది రైజ్ సినిమాను మించిన బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

Telugu Allu Arjun, Bunny, Netizens, Pushpa, Pushpa Rule, Pushpraj-Movie

400 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తల గురించి స్పందించడానికి నిర్మాతలు అస్సలు ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.

మరోవైపు బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.పుష్ప ది రూల్ షూట్ మొదలైన తర్వాతే బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.రష్మిక పాత్ర చనిపోతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని నిర్మాతలు క్లారిటీ ఇవ్వగా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube